Gudivada Amarnath: ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం
ABN, Publish Date - Feb 29 , 2024 | 01:00 PM
ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా రాజధాని నిర్ణయం మేరకు రుషికొండ నిర్మాణాలను.. త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు.
విశాఖ: ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా రాజధాని నిర్ణయం మేరకు రుషికొండ (Rushikonda) నిర్మాణాలను.. త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తామా? లేదా? అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామన్నారు. అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. అన్ని అనుమతులు తీసుకొనే నిర్మాణాలు చేపట్టినట్టు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 01:00 PM