Rain Alert: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు..
ABN, Publish Date - Sep 07 , 2024 | 06:40 PM
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిస్సా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశముంది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం (low pressure) కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిస్సా (Odisha), పశ్చిమబెంగాల్ (West Bengal), బంగ్లాదేశ్ (Bangladesh) తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు (Rains) పడతాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజా జీవనం అస్తవ్యస్థమైంది. వరదలు ఇప్పుడిప్పుడే తగ్గి అంతా కుదుట పడుతుందని అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత వారం రోజులుగా సింగ్‌నగర్ వాసులను అవస్థలకు గురిచేసిన బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
కాగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షం పడుతుండడంతో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ముంపు బాధితులు మరింత ఆందోళన చెందుతున్నారు. విజయవాడ నగరంలో గంటపాటు కురుస్తున్న వర్షానికి బస్టాండ్, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు బుడమేరు పొంగిన నేపథ్యంలో చాలా ఇళ్లు ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు మళ్లీ వర్షం పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెగిన చెరువు కట్ట.. దీన పరిస్థితిలో గ్రామస్థులు
గేట్లను ఢీ కొట్టిన బోట్లు.. యజమానుల ఆచూకీ లభ్యం..
దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు..
విజయవాడ వాసులకు మరో చేదు వార్త..
గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 07 , 2024 | 06:40 PM