ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Home Minister Anitha: వైసీపీ ప్రభుత్వం నాపై 23కేసులు పెట్టింది: హోంశాఖ మంత్రి అనిత

ABN, Publish Date - Jul 07 , 2024 | 04:14 PM

గత వైసీపీ ప్రభుత్వంలో తనపై 23కేసులు బనాయించారని హోంమంత్రి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిందని, మద్యం దుకాణాల ఎదుట వారిని కాపలాగా పెట్టారని దుయ్యబట్టారు. జగన్ అరాచకాలు భరించలేక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు సైతం రాజకీయాలపై దృష్టి పెట్టి వైసీపీని ఇంటికి సాగనంపారని చెప్పారు.

అనకాపల్లి: గత వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt)లో తనపై 23కేసులు బనాయించారని హోంమంత్రి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిందని, మద్యం దుకాణాల ఎదుట వారిని కాపలాగా పెట్టారని దుయ్యబట్టారు. జగన్ అరాచకాలు భరించలేక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు సైతం రాజకీయాలపై దృష్టి పెట్టి వైసీపీని ఇంటికి సాగనంపారని చెప్పారు. ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించకుండా నాడు-నేడు పేరుతో ఇతర పనులు చేయిస్తే ఉత్తీర్ణత శాతం ఎలా పెరుగుతుందని మండిపడ్డారు.


సాధారణ ఉపాధ్యాయురాలైన తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఆపై హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని చెప్పారు. తనకు ఇంతటి సముచిత స్థానం కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తండ్రిలా ఆదరించారని భావోద్వేగానికి గురయ్యారు. దేశానికి రాష్ట్రపతి అయినా ఉపాధ్యాయుడికి మొక్కాల్సిందే అని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ఎనలేని గౌరవం ఉన్న ఉపాధ్యాయ వృత్తిని వైసీపీ ప్రభుత్వం కించపరిచిందని హోంమంత్రి అనిత అన్నారు.

ఇది కూడా చదవండి:

Home Minister Anitha: బాలిక హత్య దురదృష్టకరం: హోంమంత్రి అనిత

Updated Date - Jul 07 , 2024 | 04:17 PM

Advertising
Advertising
<