Hanuma Vihari: ఏసీఏ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన జనసేన
ABN, Publish Date - Feb 27 , 2024 | 10:26 PM
టీమిండియా క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) ఏసీఏకు గుడ్ బై వ్యవహారంపై జనసేన నేత పీతల మూర్తి యాదవ్(Peethala Murthy Yadav) సంచలన విషయాలు బయటపెట్టారు.
విశాఖ: టీమిండియా క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) ఏసీఏకు గుడ్ బై వ్యవహారంపై జనసేన నేత పీతల మూర్తి యాదవ్(Peethala Murthy Yadav) సంచలన విషయాలు బయటపెట్టారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 చండీగఢ్‌లో జరిగిన టీ20 టోర్నమెంట్లో మేనేజర్, ట్రైనర్‌పై దాడి చేశారని అన్నారు. ఇప్పటివరకు ఆ వ్యవహారాన్ని ఏసీఏ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. చండీగఢ్ హోటల్‌ల్లో జరిగిన దాడి దృశ్యాలను మీడియా ముందు పెట్టారు.
హనుమ విహారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పృథ్వి తండ్రిపై మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజీ సెలక్షన్ మ్యాచుల్లో కనీసం స్కోర్లు చేయని వారిని జట్టులో ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. హనుమ విహారిపై కక్షపూరితంగా ఏసీఏ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. హనుమ విహారి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం చిత్తశుద్ధి ఉంటే హనుమ విహారి విషయంపై సెట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని పీతల మూర్తి యాదవ్ కోరారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 27 , 2024 | 10:27 PM