Visakhapatnam: 'భూ దాహం' అపరిమితం - అనంతం... విశాఖలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా..
ABN, Publish Date - Feb 03 , 2024 | 11:34 AM
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కమార్కులు బొక్కేస్తున్నారు. అధికార నేతల అండదండ చూసుకుని కడుపు నిండా స్వాహా చేస్తున్నారు. కోరలు చాస్తున్న కబ్జా మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడం కాదు కదా ఇంకా రోజురోజుకు పెరిగిపోతోంది.
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కమార్కులు బొక్కేస్తున్నారు. అధికార నేతల అండదండ చూసుకుని కడుపు నిండా స్వాహా చేస్తున్నారు. కోరలు చాస్తున్న కబ్జా మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడం కాదు కదా ఇంకా రోజురోజుకు పెరిగిపోతోంది. బెదిరింపులు, దాడులు, గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యం అయ్యాయి. కొన్ని కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనకాడడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమంగా, వేగంగా ధనార్జనకు ఉన్న మార్గాలలో భూ కబ్జాలు లాభసాటిగా భావిస్తూ నేరాలకు తెగబడుతున్నారు. విశాఖలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసుతో ఈ అనుమానాలు నిజమనిపిస్తున్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా.. ఈ హత్యకు భూ లావాదేవీలే కారణమని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తహశీల్దార్ రమణ్యయపై గుర్తు తెలియని దుండగలు రాడ్ తో దాడి చేశారు. గమనించిన వాచ్ మెన్ కేకలు వేయడంతో వేయడంతో పారిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే రమణయ్యను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు.
ఈ ఘటనపై రమణయ్య కుటుంబసభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. నగరంలో భూ అవినీతి పెరిగిపోతోందని, గొడవలు, దాడులతో మొదలై చివరకు హత్యల వరకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో అధికారులకు రక్షణ కరమైందని రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ వాపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.
విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వివాదస్పద భూముల సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భూముల ఆక్రమణలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. భూ వివాదాలన్నీ వైసీపీ నేతల చుట్టే తిరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తుండం గమనార్హం. విశాఖలో భూములకు అమాంతం ఊహించని విలువ పెరిగిపోవడంతో ప్రైమ్ ఏరియాలో వంద గజాల స్థలం ఒక కోటి నుంచి రెండు కోట్ల వరకు పలుకుతోంది. అధికార పార్టీ కీలక నాయకులు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల భరోసాతో నేరస్థులు రెచ్చిపోతుండటం గమనార్హం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 03 , 2024 | 11:55 AM