ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lokesh: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్..

ABN, Publish Date - Sep 26 , 2024 | 08:55 AM

విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఆరున్నర గంటలకు సింహాచలం వరాహనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) గురువారం ఉదయం ఆరున్నర గంటలకు సింహాచలం (Simhachalam) వరాహనరసింహస్వామిని (Varahanarasimhaswamy) దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కప్పస్తంభం ఆలింగం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రి లోకేష్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. కాగా విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు లోకేష్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.


అనంతరం గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను మంత్రి లోకేష్ కలుసుకుంటారు. సమయాన్ని బట్టి కార్యకర్తలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. తరువాత నగరంలో మునిసిపల్‌ పాఠశాలలను సందర్శిస్తారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. జిల్లా విద్యాశాఖకు కూడా సమాచారం ఇవ్వలేదు. నగరంలో పాఠశాలల వివరాలు ఇప్పటికే సేకరించిన లోకేశ్‌, ఆకస్మికంగా ఒకటి, రెండు పాఠశాలలను సందర్శించవచ్చునని సమాచారం.


కాగా బుధవారం సాయంత్రం రుషికొండలోని రాడిసిన్‌ బ్లూ హోటల్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపైనే చర్చ జరిగింది. అందరూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరచారు. ప్రస్తుతం కర్మాగారంలో ఒక్కొక్క యూనిట్‌ను మూసివేస్తున్నారని, ఉద్యోగులను డిప్యుటేషన్‌పై బయటకు పంపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంతో చర్చించాలని కోరారు. ఇప్పుడున్న సంక్షోభం నుంచి బయటపడి కర్మాగారం సజావుగా నడవాలంటే ఉక్కు దిగ్గజం సెయిల్‌లో విలీనం చేయడం ఒక్కటే మార్గమని కొందరు అభిప్రాయపడ్డారు. 32 మంది బలిదానంతో ఏర్పడిన కర్మాగారం ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్టీల్‌ప్లాంటును కాపాడుకోవాలని ఉద్దేశంతో ఉన్నారన్నారు.


సెయిల్‌తో సంబంధం లేకుండా కేంద్రం నుంచి భారీగా రుణం తీసుకుని కర్మాగారాన్ని నడిపితే ఎలా ఉంటుందని కొందరు ప్రస్తావించగా మరికొందరు పలు సందేహాలు వ్యక్తంచేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో సజావుగా ప్లాంటు నడిపితే ఫర్వాలేదని...రెండు, మూడేళ్ల తరువాత నిధుల సమస్య మళ్లీ మొదటకు వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని మరికొందరు సందేహం వ్యక్తంచేశారు. కర్మాగార యాజమాన్యం ఒంటెత్తు పోకడలు, కార్మికుల్లో కొందరి ప్రవర్తనపై కూడా ప్రజల్లో అపోహాలు ఉన్నాయని కొందరు అన్నారు. అందువల్ల పటిష్టమైన యాజమాన్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర పరిధిలో ఉన్న భూములు మొత్తం బదిలీ చేస్తే బ్యాంకులు నుంచి రుణం తీసుకుని కర్మాగారానికి నడుపుకోవచ్చునని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఏదోవిధంగా కర్మాగారాన్ని నిలబెట్టుకోవాలని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నివేదిక రూపంలో సమర్పించాలని తీర్మానించారు. చంద్రబాబు ద్వారా కేంద్రంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని, అందుకు కాలయాపన కాకుండా సత్వరమే చర్యలు ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ విశాఖపై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పాదయాత్ర సమయంలో ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చానని గుర్తుచేశారు. విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగువాడికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, హైదరాబాద్‌లో తమ ఇంటికి విశాఖ ఉక్కు స్టీల్‌ వాడామన్నారు. కర్మాగారాన్ని వెంటాడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి కార్మికుల కళ్లల్లో ఆనందం చూడాలనే దృఢ సంకల్పంతో కేంద్రంతో సంప్రతింపులు జరుపుతున్నామని అన్నారు. అందరికీ ఆమోద్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను చంద్రబాబునాయుడుకు నివేదిస్తామన్నారు. కేంద్రంతో సీఎం చర్చించి ఉక్కు కర్మాగారంపై ఒక నిర్ణయం తీసుకుంటారని లోకేశ్‌ వెల్లడించారు. రానున్న రోజుల్లో మిగతా సమస్యలపై చర్చించుకుని నిర్ణయాలు తీసుకుందామన్నారు. అందరూ కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం కాని సమస్య ఉండదన్నారు. సమావేశంలో విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయకుమార్‌, కోండ్రు మురళి, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, టీడీపీ పెందుర్తి, విశాఖ దక్షిణ ఇన్‌చార్జులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్‌, సెయిల్‌ డైరెక్టర్‌, బీజేపీ నాయకుడు కాశీవిశ్వనాథరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 08:55 AM