Minister Amarnath: కొందరు పార్టీకి వెన్నుపోటు పొడవడం కంటే వెళ్లిపోవడమే మంచిది
ABN, Publish Date - Jan 02 , 2024 | 08:16 PM
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao ) కుటుంబం రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) స్పందించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదన్నారు. దాడి వీరభద్ర రావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అప్పుడు వారు తిరస్కరించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
విశాఖపట్నం: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao ) కుటుంబం రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) స్పందించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదన్నారు. దాడి వీరభద్ర రావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అప్పుడు వారు తిరస్కరించారన్నారు. ఎన్నికల వేళ టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టం లేదని చెప్పారు. 175 సీట్లే ఏపీలో ఉన్నాయన్నారు. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వగలరని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
వైసీపీలో గెలిచే వారికి సీట్లు..కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదన్నారు. గడిచిన కొన్ని రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారని.. అప్పటి నుంచి చర్చ మొదలైందని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండవద్దని స్పష్టంగా పార్టీ చెప్పిందన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Updated Date - Jan 02 , 2024 | 08:16 PM