Lokesh: ఐటీ పాలసీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ABN, Publish Date - Sep 25 , 2024 | 01:30 PM
Telangana: స్టీల్‌ప్లాంట్‌పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందుల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంకి ఎప్పుడు తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 25: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చెప్పారని తాము చెబుతున్నామని.. స్టీల్ ప్లాంట్ ప్లాంటును కాపాడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) స్పష్టం చేశారు. బుధవారం నాడు విశాఖలో నిర్వహించిన సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. స్టీల్‌ప్లాంట్‌పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందుల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంకి ఎప్పుడు తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Chandrababu: వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు
త్వరలోనే ఐటీ పాలసీ వస్తుందని వెల్లడించారు. పారిశ్రామిక వర్గాలతో నేరుగా టచ్‌లోకి వెళ్తున్నామని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు హామిపై స్పష్టంగా ఉన్నామని మంత్రి తెలిపారు. విశాఖకు రాబోవు రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. త్వరలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో రోడ్ షో నిర్వహిస్తానన్నారు. ప్రతి మూడేళ్లకు సర్వర్లు అప్ డేట్ చేయాలన్నారు. డేటా సెంటర్లు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రాబోయే 100 రోజుల్లో ఐటీ పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్
నిజాలన్నీ బయటకు వస్తాయి...
‘‘రెడ్ బుక్ గురుంచి స్పష్టంగా చెప్పానను. ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నాం.. ఇప్పటికే అలాంటి వారి పైన కేసులు కూడా పడ్డాయి...ఏదైనా చట్ట ప్రకారమే చేస్తాం. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. విశాఖలో ఐదేళ్లలో ఐటీ మంత్రి ఐటీ గురుంచి మాట్లాడలేదు. ఇపుడు ఏపీ గురుంచి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు మాట్లాడుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని జగన్ వెనక్కి తీసుకెళ్లాడు. అదే విధానం టీటీడీలో తీసుకొచ్చి భ్రష్టు పట్టించాడు.
Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు
నెయ్యి ధర 40 శాతం తగ్గించడం వెనుక మర్మం అందరికి తెలిసింది. నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సిట్ వేసింది. అన్ని నిజాలు బయటకు వస్తాయి. బాబు వస్తే బాగుంటుందన్న భావనలో పెట్టుబడిదారులు వున్నారు. పొరపాటున సైకో వస్తే ఏంటన్న భయం ఇంకా పెట్టుబడుదారుల్లో ఉంది’’ అని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. ఎంపీ శ్రీ భరత్, సిఐఐ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
CM Chandrababu: పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
AP Highcourt: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలిపివేయండి.. హైకోర్ట్ ఆర్డర్స్
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 25 , 2024 | 01:31 PM