ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: వైసీపీ హయాంలో భారీ స్కాం: జనసేన

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:20 PM

మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు.

విశాఖ: వైసీపీ (YCP) హాయంలో ఎక్సైజ్ శాఖ (Excise Department)లో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి (Jagan) ఎక్సైజ్ డిపార్టుమెంట్‌నే లేపేసారని, ఆ డిపార్ట్‌మెంట్ లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ (Janasena MLA Vamsi Krishna Srinivas) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు. రాజ్ కసిరెడ్డి అనే బినామీని విచారణ చేస్తే కొన్ని కోట్ల రూపాయల సొమ్ము బయట పడుతుందన్నారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేస్తానన్నారు.


జగన్ పై తీవ్ర ఆరోపణలు..

వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరని, జగన్‌ను నమ్ముకుని ఉన్న వాళ్ళ రోడ్డు పడ్డారని.. అందుకు తానే ఉదాహరణ అని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. జగన్ మాటల్లో గుడ్ అనే పదం లేదని, మద్యపానం నిషేధం అమలు చేయలేదని.. పోలవరం కట్టలేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే వ్యతిరేకత వచ్చిందా..జగన్ అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పాలన అద్భుతంగా ఉందని.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ది ప్లాస్టిక్ నవ్వు అని... అన్న జగన్‌పై వైఎస్ షర్మిల చెప్పినవన్నీ నిజాలే అన్నారు.

జగన్ చెప్పినట్లే ఎంపీ విజయసాయి రెడ్డి, ఎస్‌వి సుబ్బ రెడ్డి మాట్లాడుతున్నారని, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతోమంది... వైసీపీని వీడడానికి రెడీగా ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గేట్లు ఎత్తేస్తే.. వైసీపీలో జగన్ తప్ప అందరూ వచ్చేస్తారని అన్నారు. ఏయూ మాజీ విసీ ప్రసాద్ రెడ్డి ఒక దుర్మార్గుడని.. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారేు. ప్రసాద్ రెడ్డి విషయంలో చట్టం తన పని చేసుకుంటుందని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు.


కాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ అమలు చేసిన విధానాన్ని రద్దు చేసి నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకువచ్చింది. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ఈనెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం (AP Govt) మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్దతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు

సత్తెనపల్లిలో హై టెన్షన్.. టీడీపీ vs వైసీపీ..

అది జగన్ చేతకానితనానికి నిదర్శనం: షర్మిల

ఆస్టిన్ పర్యటనలో మంత్రి లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 28 , 2024 | 01:20 PM