AP News: అనకాపల్లి ఫుడ్ పాయిజన్‌పై పాస్టర్ భార్య సమాధానం ఇదీ
ABN, Publish Date - Aug 20 , 2024 | 12:41 PM
Andhrapradesh: అనకాపల్లిలోని అనాథాశ్రమయంలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపటిన విషయం తెలిసిందే. కోట ఊరట్లలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పాస్టర్ కిరన్ భార్య రమ ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ‘‘శనివారం రాత్రి నక్కపల్లి, పొందూరుకు చెందిన ఇద్దరు దాతలు ఆహారం ఇచ్చారు. ఒక దాత సమోసా, చాక్లెట్లు ఇవ్వగా...
అనకాపల్లి, ఆగస్టు 20: అనకాపల్లిలోని (Anakapalli) అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కోట ఊరట్లలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పాస్టర్ కిరణ్ భార్య రమ ఏబీఎన్‌తో మాట్లాడారు. ‘‘శనివారం రాత్రి నక్కపల్లి, పొందూరుకు చెందిన ఇద్దరు దాతలు ఆహారం ఇచ్చారు. ఒక దాత సమోసా, చాక్లెట్లు ఇవ్వగా... మరో దాత బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, పునుగులు, కూర ఇచ్చారు. వైట్ రైస్, సాంబార్ తిన్న నలుగురు పిల్లలు చనిపోయారు. ముగ్గురు పిల్లలు చనిపోవడం మా దురదృష్టకరం. దాతలు ఇచ్చిన ఆహారమే పిల్లలతో పాటు మేము తిన్నాం. ఏజెన్సీ, తండాలకు చెందిన పిల్లలు విద్యను అందించడమే మా లక్ష్యం. చిన్న తరగతుల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన 86 మంది పిల్లలు ఉన్నారు. సంస్థ నిర్వహణలో ఎటువంటి దురుద్దేశం లేదు’’ అని రమ స్పష్టం చేశారు.
Rain Alert: ప్రమాదకర స్థితిలో ముసారంబాగ్ బ్రిడ్జి
కాగా.. అనకాపల్లిలోని అనాథాశ్రమంలో చుట్టుపక్కల ఉన్న చిన్నారులు చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఆదివారం కలుషిత ఆహారం తిని ముగ్గురు మృత్యువాతపడగా.. దాదాపు 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆహారంతో పాటు సమోసాలను చిన్నారులు తిన్నారు. ఆ వెంటనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆశ్రమ నిర్వాహకుడు వాళ్లను ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన వెంటనే ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. మిగిలిన విద్యార్థులు నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
Kolkata Doctor Case: కోల్‌కత్తా డాక్టర్‌పై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు.. అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Pawan: ఏపీలో ఒకేరోజు పెద్దసంఖ్యలో గ్రామాసభలు
Farmers: అనంతలో రైతుల ఆందోళన.. కారణమిదే!
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 20 , 2024 | 01:17 PM