ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Poli Padyami: కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి.. ప్రత్యేక పూజలు..

ABN, Publish Date - Dec 02 , 2024 | 08:20 AM

కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల‌ కాంతులతో కళకళలాడుతోంది. కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు.

విశాఖ: కార్తిక మాసం (Karthika month) శివుడికి (Lord Siva) అత్యంత ప్రీతి పాత్రమైనది. సోమవారంతో ఈ మాసం వెళ్లిపోతుంది. రేపటి (మంగళవారం) నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి (Poli Padyami ). ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు. ఈ క్రమంలో సింహాచలం పుష్కరిణిలో పోలి పాడ్యమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునుంచే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కరణిలో స్నానమాచరించి అరటి దవ్వలో దీపాలు వెలిగించి విడిచిపెడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీగా మారంది. దీంతో సింహాచలం పుష్కరిణి మార్గం నుంచి వరాహ పుష్కరిణి వరకు వాహనాల రాకపోకలను ట్రాఫిక్‌ పోలీసులు పూర్తిగా నిషేధించారు.


దీపాల వెలుగుల‌ కాంతులతో కృష్ణమ్మ కళకళ..

కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల‌ కాంతులతో కళకళలాడుతోంది. కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు. భక్తులతో భవానీ జల శంకర ఆలయం, పాత శివాలయం, యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.


పోలి కథ

పూర్వ కాలంలో కృష్ణా తీరంలో ఓ ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్లింది.

చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్ళతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది.

ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచి పెట్టలేదు. ఆమె భక్తికి దేవతలు మెచ్చి.. ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు పుష్పక విమానాన్ని తీసుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా తోడికోడళ్ళు .. తమ కోసమే వారు వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త, మిగిలిన తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకు వెళ్తారు.

అయితే పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపం వెలిగించాలని శాస్త్ర పండితులు చెబుతారు. దీని వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం కలుగుతుందని అంటారు. అలాగే ఈ రోజు దీప దానం చేయడం కూడా చాలా మంచిదని వారు వివరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ

అరకొర వసతులు అద్దె భవనాలు

మహేశ్‌బాబు ఎంజాయ్‌ చేశారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 02 , 2024 | 08:20 AM