AP News: అయ్యో పాపం... రంజాన్ మరుసటి రోజే విషాదం!
ABN, Publish Date - Apr 12 , 2024 | 10:42 AM
Andhrapradesh: ఆ ముస్లిం కుటుంబీకులు ఎంతో ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. తర్వాతి రోజు జరిగిన అనుకోని ఘటన వారిని విషాదంలోకి నెట్టేసింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న బాలుడిని ఒక్కసారిగా ప్రమాదం చుట్టిముట్టి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపించారు. అనకాపల్లి జిల్లాలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సానికి ఓ బాలుడు బలయ్యాడు. శుక్రవారం ఉదయం కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి కాలేజ్ బస్సు దూసుకెళ్లింది.
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 12: ఆ ముస్లిం కుటుంబీకులు ఎంతో ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. తర్వాతి రోజు జరిగిన అనుకోని ఘటన వారిని విషాదంలోకి నెట్టేసింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న బాలుడిని ఒక్కసారిగా ప్రమాదం చుట్టిముట్టి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపించారు.
Andhra Pradesh: జగన్.. ఈ పాపం ఎవరిది..? వైసీపీ పాలనలో సామాన్యుడి కష్టాలు..
అసలేం జరిగిందంటే...
అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సానికి ఓ బాలుడు బలయ్యాడు. శుక్రవారం ఉదయం కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి కాలేజ్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముస్లిం కుటుంబానికి చెందిన గౌస్(12) అనే బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బస్సు బీభత్సం ధాటికి టిఫిన్ వాహనంతో పాటు కారు, నాలుగు బైకులు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్ వంద పడకల ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయిన బాలుడి కుటుంబీకులు పెందుర్తి నుంచి పిఠాపురంకు కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద ఆగారు. కాసేపటికే అనుకోని దుర్ఘటనతో బాలుడి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రంజాన్ మరుసటి రోజే ప్రమాదం జరగడంతో మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. సంఘటనా స్థలానికి కసింకోట సీఐ వినోద్ బాబు, పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
YS Sharmila: ఇవాళ పులివెందులలో షర్మిల ప్రచారం.. సర్వత్రా ఉత్కంఠ..
Lok Sabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. సైడ్ అవుతున్న కీలక వర్గం.. !
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 12 , 2024 | 10:46 AM