ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sri Bharat: వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది

ABN, Publish Date - Mar 05 , 2024 | 09:06 PM

పీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీ భరత్(Sri Bharat) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు ఎస్సీ, బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

విశాఖపట్నం (గోపాలపట్నం): ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీ భరత్(Sri Bharat) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు ఎస్సీ, బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శ్రీ భరత్, తెలుగు తమ్ముళ్లు భారీగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో గణబాబుకు పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి పువ్వులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ... పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల కన్నా గణబాబుకు మూడు రెట్లు మెజార్టీ వస్తుందని తెలిపారు.

గణబాబుకు జనాలు స్వాగతం పలకడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని వైసీపీ నాయకులు చెప్పి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు బెదిరించిన ప్రజలు తమకు బ్రహ్మ రథం పడుతున్నారని చెప్పారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాల పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రశాంత విశాఖ నగరంలో అధికార పార్టీ ఎంపీ ఇంట్లో ఒక కిడ్నాప్ అలాగే మేజిస్ట్రేట్ హత్యలు జరిగాయని అన్నారు. రుషికొండని ఒక పర్యాటక ప్రాంతమని చెప్పి ప్రభుత్వం దోబూచులాట ఆడుతుందని చెప్పారు. పేదవాడికి పది రూపాయలు ఇచ్చి రూ. 100 లాక్కుని ఈ ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుందని మడ్డిపడ్డారు.వైసీపీ దుర్మార్గపు పాలనకు ముగింపు పలికే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ - జనసేన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 09:13 PM

Advertising
Advertising