AP News: అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు
ABN, Publish Date - Jul 11 , 2024 | 09:57 AM
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ అనుమానించినట్లుగానే నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనకాపల్లి, జూలై 11: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనకాపల్లి (Anakapalli) మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ అనుమానించినట్లుగానే నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు ఫోన్ వాడకపోవడంతో అతడికి కనుగొనడం పోలీసులకు సవాల్‌గా మారింది. చివరకు రాంబిల్ల మండలం కొప్పుగుండు పాలెంలో నిందితుడు సురేష్ మృతదేహం లభ్యమైంది. కొప్పగొండపాలెం పరిసరాలలో మృతదేహం బోర్లా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
T.highcourt: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ
ఇదీ విషయం
కాగా... అనకాపల్లికి చెందిన బాలికను నిందితుడు సురేష్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో ఈనెల 5న ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆపై సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలో కూడా బాలికను సురేష్ వేధింపులకు గురిచేయడంతో.. అతడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేయించారని కోపంతో రగిలిపోయిన సురేష్.. బెయిల్‌పై విడుదలైన వెంటనే బాలికను దారుణంగా హతమార్చినట్లు తల్లిదండ్రులు వాపోయారు.
Social Media: సోషల్ మీడియాలో మితిమీరి కామెంట్లు, ట్రోలింగ్స్ చేస్తు్న్నారా..?
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోడానికి తీవ్రంగా శ్రమించారు. నిందితుడు విడిచి వెళ్లిన లేఖ ఆధారంగా సురేష్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావించారు. ‘‘ఉంటే ఇద్దరం కలిసి ఉండాలని.. లేదంటే చనిపోవాలి’’ అని లేఖలో నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. కానీ... చివరకు నిందితుడు లేఖలో తెలిపిన ప్రకారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!
AP Cabinet: అలా వచ్చి.. ఇలా వాలిపోతున్నారు!
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 10:14 AM