ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swarupanandendra: వారణాసిలో శివ కేశవుల కోసం ప్రత్యేక కార్యక్రమం

ABN, Publish Date - Oct 21 , 2024 | 04:48 PM

Andhrapradesh: దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మిక సంగమం జరగాలి అన్న ఉద్దేశంతో కాశీలో ఒక కార్యక్రమం చేపట్టామని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో "కాశీలో కార్తీకం" పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నామన్నారు.

Swarupanandendra Swami

విశాఖపట్నం, అక్టోబర్ 21: విశాఖ శారదా పీఠం హైందవ ధర్మ పరిరక్షణతో పాటు ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తోందని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి (Swarupanandendra Swami) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2023లో హర్యానాలోని కురుక్షేత్రలో లక్ష చండీయాగం చేశామని తెలిపారు. నభూతో నభవిష్యతి అన్న స్థాయిలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మిక సంగమం జరగాలన్న ఉద్దేశంతో కాశీలో ఒక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు చెప్పారు. శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో "కాశీలో కార్తీకం" పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నామన్నారు.

Kadiyam Srihari: బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన కడియం


ముక్తి క్షేత్రం వారణాసిలో చేసే పనికి కోటి రెట్ల ఫలం లభిస్తుందన్నారు. నవంబర్ 3 - 5 తేదీల్లో సనాతన కుంజ్ జరుగుతుందని వెల్లడించారు. రామభద్రచార్య సహా అనేక మంది ప్రఖ్యాత స్వామీజీలు, అఖండాల అధిపతులు వస్తున్నారని అన్నారు. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ను కలిసి ఆహ్వానించామని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని (PM Modi) కూడా ఆహ్వానించబోతున్నామని తెలిపారు. నవంబర్ 3న యజ్ఞ సంకల్పంతో కార్యక్రమం మొదలవుతుందన్నారు. నవంబర్ 4న కార్తీక సోమవారం సందర్భంగా రామేశ్వరం నుంచి తెచ్చిన మట్టితో శివలింగం ఏర్పాటు చేసి పూజ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.

Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 971 పాయింట్లు కోల్పోయిన మిడ్ క్యాప్


ల్యాండ్ అనుమతి రద్దు

కాగా.. విశాఖ శారదా పీఠంకు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలం విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విశాఖ శారదా పీఠంకు ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే కేవలం రూ.15 లక్షలకు స్వాములోరీ పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చేసిన విషయం తెలిలసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. విశాఖ నుంచి వచ్చిన నివేదికను కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు తొక్కి పెట్టినట్లు సమాచారం. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రసారం అయ్యింది. ఈ కథనంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. వెంటనే ఫైల్ తెప్పించుకొని అధికారులపై సీరియస్ అయ్యారు. ఆపై నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఉన్న భూమిని కట్టబెట్టడాన్ని రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అధికారికంగా ఉత్వర్వులు జారీ అవ్వాల్సి ఉంది. అలాగే తిరుమల శ్రీవారి సన్నిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన శారదా పీఠం నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి...

Virat Kohli: ఒత్తిడికి దూరంగా విరాట్ కోహ్లీ.. భార్యతో భక్తి కాన్సర్ట్‌కు

Muappalla: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల వినతి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 05:47 PM