ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Palla Srinivasa Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం సందర్శించిన పల్లా శ్రీనివాసరావు

ABN, Publish Date - Jun 18 , 2024 | 09:35 PM

స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ(Privatization)కు వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద దీక్ష చేస్తున్న శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు (TDP State President) పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) సందర్శించారు. మంగళవారానికి దీక్ష 1223వ రోజుకు చేరుకుంది.

విశాఖ: స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ (Privatization)కు వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద దీక్ష చేస్తున్న శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు(TDP State President) పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) సందర్శించారు. మంగళవారానికి దీక్ష 1223వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సందర్శించిన ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షించే బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్‌ను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.


రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు, యువ నాయకుల రుణం తీర్చుకుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు. తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్‌ను ఆదుకోవడం తప్ప తనకు ఏ పదవీ ముఖ్యం కాదన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడే బాధ్యత తనదే అని, తన మీద పూర్తిగా విశ్వాసం ఉంచాలన్నారు. రాష్ట్రంలో ఉన్న మైన్స్‌ను స్టీల్ ప్లాంట్‌కు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:

AP Govt: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియామకం..

Updated Date - Jun 18 , 2024 | 09:35 PM

Advertising
Advertising