కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YV Subbareddy: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..

ABN, Publish Date - Jan 04 , 2024 | 03:29 PM

Andhrapradesh: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

YV Subbareddy: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..

అనకాపల్లి: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీ విలీనంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YCP Leader YV Subbareddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో (YCP) అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో (Congress) విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

షర్మిలతో సహా ఎవరు ఏ పార్టీ లో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు జగన్‌పైనే ఉన్నాయన్నారు. జగన్ కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని అన్నారు. అందుకే ప్రజల ఆశీస్సులు తమతోనే ఉంటాయని స్పష్టం చేశారు. లోకేష్ నావ మునిగి పోయిందని.. జాకీలు వేసి లేపుతున్నారని.. అయినా లేవడం లేదని వైవీ సుబ్బారెడ్డి యెద్దేవా చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2024 | 03:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising