ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: సర్పంచ్‌ల వైపుంటారా?.. వాలంటీర్ల వైపా?.. జగన్‌కు వైవీబీ సూటి ప్రశ్న

ABN, Publish Date - Feb 27 , 2024 | 01:37 PM

Andhrapradesh: ఏపీలో 12,918 గ్రామాల అభివృద్ధి కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ ఉన్నాడో లేదో... విన్నాడో లేదో తెలీదు కానీ.. మా 16 న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వంపై అంతిమ యుద్ధాన్ని ప్రకటించాం’’ అని అన్నారు. ప్రభుత్వ వైఖరితో విసిగిపోయామన్నారు. పార్టీలకు అతీతంగా రాబోయే ఎన్నికల్లో ఓడించండి అని పిలుపునిచ్చామన్నారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: ఏపీలో 12,918 గ్రామాల అభివృద్ధి కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ (Andhra Pradesh Panchayat Raj Chamber President YVB Rajendra Prasad) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ (CM Jagan) ఉన్నాడో లేదో... విన్నాడో లేదో తెలీదు కానీ.. మా 16 న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వంపై అంతిమ యుద్ధాన్ని ప్రకటించాం’’ అని అన్నారు. ప్రభుత్వ వైఖరితో విసిగిపోయామన్నారు. పార్టీలకు అతీతంగా రాబోయే ఎన్నికల్లో ఓడించండి అని పిలుపునిచ్చామన్నారు. జగన్ ఓడిపోతేనే సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు నిధులు విధులు అధికారాలు వస్తాయన్నారు.

సర్పంచ్‌ల నిధులను జగన్ సొంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆరోపించారు. రూ.50 వేల కోట్లు గ్రామీణ ప్రయోజనాల కోసం ఉపయోగపడకుండా దారి మళ్లించారన్నారు. నవరత్నాలలో రెండు రత్నాలు తమ సర్పంచ్‌లవే అని అన్నారు. తాగునీరు, సాగునీరు, డ్రైనేజీ పనుల కోసం ప్రజలు తమను నిలదీస్తున్నారన్నారు. ‘‘సూటిగా అడుగుతున్నాము..16 డిమాండ్లపై మీ వైఖరి ఏంటో జగన్ చెప్పాలి. గ్రామ వాలంటీర్లకు సర్పంచులకన్నా గౌరవ వేతనం ఎక్కువ.. సర్పంచ్‌లను ఎందుకు డమ్మీలుగా మారుస్తున్నారు. వాలంటీర్లు రాజ్యాంగ విరుద్దం కాదా.. సర్పంచ్‌లు ఇండిపెడంట్ సింబల్‌తో గెలిచి ప్రజల మన్ననలు అందుకున్నారు. మీరు సర్పంచ్‌ల వైపు ఉంటారా?... వాలంటీర్ల వైపు ఉంటారా?.. సీఎం స్పష్టం చేయాలి’’ అని వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 01:37 PM

Advertising
Advertising