poultry: కోళ్ల పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు విఫలం
ABN, Publish Date - Dec 29 , 2024 | 12:05 AM
poultry: కర్లాంలోని కోళ్ల పరిశ్రమలో యాజమాన్యా నికి, కార్మికులకు మధ్య శనివారం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. శుక్రవారం నుంచి కార్మికులు నిరవధిక దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో యాజమాన్యం శనివారం కార్మికులతో చర్చలు జరిపింది.
చీపురుపల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్లాంలోని కోళ్ల పరిశ్రమలో యాజమాన్యా నికి, కార్మికులకు మధ్య శనివారం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. శుక్రవారం నుంచి కార్మికులు నిరవధిక దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో యాజమాన్యం శనివారం కార్మికులతో చర్చలు జరిపింది.యాజమాన్యం తరపునజీఎం హరికృష్ణ, డీజీఎం గౌరి, కార్మి కుల తరపున సీఐటీయూ జిల్లా నాయకులు టీవీ రమణ, అంబల్ల గౌరినాయుడు, గురు నాయుడు, ఈశ్వరరావు చర్చలు జరిపారు. యాజమాన్యం మొండి వైఖరికి విడనాడి తమ డిమాండ్‌కు అంగీకరించాలని కార్మికులు కోరారు. అయితే తమ పరిధి మేరకు మూడు వందలు పెంచగలమని, మరింత సమయమిస్తే, యాజమాన్యంతో మాట్లాడతామని చర్చల్లో పాల్గొన్నవారు తెలిపారు. చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో కార్మికులు యధావిధిగా నిరవధిక దీక్షలు కొనసాగించారు. దీక్షల్లో భాగంగా పరిశ్రమ ప్రధాన గేటు వద్ద కార్మికులు శనివారం వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. కాగా కర్లాం కోళ్ల పరిశ్రమ వద్ద జరుగుతున్న కార్మికుల దీక్ష శిబిరాన్ని ఆర్డీవో సత్యవాణి, డీఎస్పీ ఎస్. రాఘ వులు శనివారం సందర్శించారు. ఇప్పటివరకూ అన్నిస్థాయిల్లో చర్చలు జరిగాయని, జన వరి 2న తమ ఆధ్వర్యంలో చర్చలు ఏర్పాటు చేస్తామని ఆర్డీవో తెలిపారు. చీపురుపల్లిలోని తమ కార్యాలయంలో జరగనున్న చర్చలకు ఇరువర్గాలు రావాలని కోరారు.
Updated Date - Dec 29 , 2024 | 12:05 AM