Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..
ABN, Publish Date - Mar 10 , 2024 | 08:42 PM
Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్న వైపు వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయింది. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులు ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదమే తప్పిందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్న వెంటనే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కాగా.. గతేడాది విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం-రాయగడ రైలును పలాస ట్రైన్ ఢీ కొట్టడంతో 13 మంది ప్రయాణికులు మరణించారు. తాజాగా జరిగిన ఈ ప్రమాదంతో గతేడాది జరిగిన ఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
Updated Date - Mar 10 , 2024 | 08:48 PM