TDP MP: జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి: ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు
ABN, Publish Date - Jul 24 , 2024 | 11:32 AM
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు.
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ (TDP MP) కలిశెట్టి అప్పల నాయుడు (Kalishetty Appala Naidu) వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు. 2017లో విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు జరుగుతున్నప్పుడు జగన్ ధర్నాచేశారన్నారు. గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చికిత్స జరిగిందని అందరూ అనుకుంటున్నారని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఎన్డీఏను ఆదరిస్తూ ప్రజలిచ్చిన తీర్పుకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, ఇలా సంబరాలు చేసుకుంటున్న సమయంలో దేశ, రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించి సూచనలు చేస్తే స్వాగతిస్తారన్నారు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అసెంబ్లీ చర్చించాలని, సమస్యలు ఏవైనా ఉంటే గుర్తించి మంచి సూచనలు ఇవ్వాలన్నారు. డివైడర్ ఢీ కొట్టి చనిపోతే కూడా రాజకీయ హత్య అంటున్నారని, టీడీపీకి కక్షసాధింపు ఆలోచన అన్నదే లేదని.. ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రం ఇబ్బందులో ఉందని, సూచనలిచ్చి సహకరించాలన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో మంచి పనులు చేస్తే అభినందించిన సందర్భాలున్నాయని.. జగన్ అభినందించకపోయినా ఫరవాలేదు.. కానీ రాష్ట్ర పరువు తీసే పనులు చేయవద్దని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సూచించారు.
కాగా విజయనగరం ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందరి దృష్టి ఆకర్షించారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అనంతరం కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. అక్కడి నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దొరికిన రెండు బస్తాల డాక్యుమెంట్లు..
షన్ రెడ్డి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది: సీఎం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 24 , 2024 | 11:32 AM