ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Budget 2024: ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

ABN, First Publish Date - 2024-02-07T11:10:52+05:30

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

అమరావతి, ఫిబ్రవరి 7: ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఏపీని సంపన్న ఆంధ్రగా మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు...

  • రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం

  • రూ.30,530 కోట్ల మూలధన వ్యయం

  • రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు

  • రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు అంచనా

  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్యలోటు

  • జీఎస్‌డీపీలో 1.56 శాతం మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కామెంట్స్...

‘‘ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. రాష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించాం. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా మా ప్రభుత్వ చర్యలు తీసుకుంది. పాలనా విభాగాలను పునర్‌‌వ్యవస్థీకరించి అన్ని వర్గాల వారికీ సాధికారిత అందించాం. విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్థులను సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకొచ్చాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారింది’’

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - 2024-02-07T11:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising