Sports School in Rayachoti: రాయచోటిలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తాం
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:27 PM
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజ కవర్గంలో ఇండోర్ స్టేడియం, క్రీడా పాఠశాల మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మం డిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇండోర్ స్టేడియం అభివృద్ధికి కృషి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
క్రీడా పరికరాలకు ఎన్‌ఆర్‌ఐ భూషణం శశివర్మ చేయూత
సంబేపల్లె, అక్టోబరు1: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజ కవర్గంలో ఇండోర్ స్టేడియం, క్రీడా పాఠశాల మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మం డిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం సంబే పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్య, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపి ఆరోగ్యంగా ఉండాల న్నారు. క్రీడలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి విద్య, ఆరోగ్య అవకాశాల్లో రిజ ర్వేషన్ సౌకర్యం కలదన్నారు. సంబేపల్లెకు చెందిన ఎన్‌ఆర్‌ఐ భూషణం శశివర్మ లక్ష రూపాయలు విలువ గల క్రీడా వస్తు వులను సంబేపల్లె పాఠశాలకు ఇవ్వడం గొప్ప విషయమ న్నారు. దాతను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన దేవప్రసాద్ రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, మాజీ సర్పంచులు శశిధర్‌రెడ్డి, గోపాల్, ఎన్నారై భూషణ్‌శశివర్మ, పాఠశాల విద్యాకమిటీ చైర్మెన్‌లు రెడ్డిరాణిరెడ్డి, రెడ్డిమోహన్, టీడీపీ నేతలు కొండా భాస్కర్‌రెడ్డి, కొండమర్ల రామచంద్ర నాయుడు, మట్లి శ్రీనివాసులు నాయుడు, మాధం బసిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, గొల్లపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 11:27 PM