ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Godavari : వందేళ్ల.. గంధర్వ మహల్‌

ABN, Publish Date - Jul 19 , 2024 | 05:08 AM

ఎత్తైన భవనం.. నాలుగు వైపులా కోట మాదిరి బురుజులు.. బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు.. తలుపులపై అందంగా చెక్కిన కళా రూపాలు.. విశాలమైన గదులు.. మయసభను తలపించే సెంట్రల్‌ హాలు..

  • అబ్బురపరుస్తున్న చారిత్రక కట్టడం

ఎత్తైన భవనం.. నాలుగు వైపులా కోట మాదిరి బురుజులు.. బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు.. తలుపులపై అందంగా చెక్కిన కళా రూపాలు.. విశాలమైన గదులు.. మయసభను తలపించే సెంట్రల్‌ హాలు.. ఓ రకంగా మైసూర్‌ ప్యాలె్‌సను తలపించేలా వందేళ్ల క్రితం నిర్మించిన అద్భుత భవనమది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట జమిందార్‌ గొడవర్తి నాగేశ్వరరావు 1924లో అర ఎకరం విస్తీర్ణంలో ఈ గంధర్వ మహల్‌ను నిర్మించారు. 1918లో పనులు ప్రారంభించి 1924లో పూర్తి చేశారు. అప్పట్లో సుమారు రూ.10 లక్షలు వెచ్చించినట్లు అంచనా.

విద్యుత్‌ సౌకర్యం పూర్తిస్థాయిలో లేని రోజుల్లో విదేశాల నుంచి విద్యుత్‌ దీపాలు తెప్పించి జనరేటర్‌ ద్వారా భవనం అంతా రంగు రంగుల దీపాలతో జిగేల్‌మనిపించేవారని పూర్వీకులు చెబుతారు. మహల్‌ నిర్మాణం కోసం బర్మా నుంచి టేకు, కలప, బెల్జియం నుంచి అద్దాలు, లండన్‌ నుంచి ఇనుప గడ్డర్‌లు దిగుమతి చేసుకున్నారు. అడుగడుగునా రాచఠీవితో నాటి జమిందారీ వ్యవస్థ వైభవానికి ప్రతీకగా గంధర్వ మహల్‌ నిలిచింది. వందేళ్లు దాటినా ఈ మహల్‌ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, ఎన్టీరామారావుతో పాటు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు ఈ భవనంలో ఆతిథ్యం స్వీకరించారు.

నేడు వేడుకలు

గంధర్వ మహల్‌ నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జమిందార్‌ గొడవర్తి నాగేశ్వరరావు వారసులు శుక్రవారం వేడుకలు నిర్వహించనున్నారు. నాగేశ్వరరావు అనంతరం మూడోతరం వారసులు గంధర్వ మహల్‌లో నివసిస్తున్నారు. నాలుగో తరం వారం కొందరు విదేశాలలో స్థిరపడ్డారు. మూడు, నాలుగు తరాల వారంతా ప్రస్తుత వేడుకలకు హాజరయ్యారు. - (ఆచంట)

Updated Date - Jul 19 , 2024 | 05:08 AM

Advertising
Advertising
<