Share News

AP News: బాలకృష్ణ కాళ్లు పట్టుకుని మహిళా మున్సిపల్ కార్మికుల విజ్ఞప్తి

ABN , Publish Date - Jan 04 , 2024 | 11:43 AM

Andhrapradesh: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రం ఎక్కడిక్కడ చెత్త నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.

AP News: బాలకృష్ణ కాళ్లు పట్టుకుని మహిళా మున్సిపల్ కార్మికుల విజ్ఞప్తి

తిరువూరు, జనవరి 4: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రం ఎక్కడిక్కడ చెత్త నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో తిరువూరులో మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ కాళ్లు పట్టుకుని విజ్ఞప్తి చేశారు.

‘‘సార్ మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పారిశుద్ధ్య పనులకు మీరు ఏ చర్యలు తీసుకోవద్దని’’ కమిషనర్‌ను వేడుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయకుండా సచివాలయం ఉద్యోగులతో పారిశుద్ధ్య పనులు చేయించడానికి ప్రయత్నించిన అధికారులను తిరువూరులో పారిశుద్య కార్మికులు అడ్డగించారు. కమిషనర్ నగర పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డుపై చీపుర్లతో సచివాలయ ఉద్యోగుల చేత పారిశుద్ధ పనులకు వెళ్తుండగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ‘‘మాకు ఇవ్వని గ్లౌజులు, మాస్కులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ’’ కమిషనర్‌ను నిలదీశారు. కార్మికుల నిరసనతో పనులకు వెళ్లకుండానే సచివాలయంలో ఉద్యోగులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 04 , 2024 | 11:43 AM