Rain Alert: ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..
ABN, Publish Date - Sep 11 , 2024 | 07:47 AM
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్‌టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరును పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఏలూరు (Eluru)లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్‌టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరు (Tammileru)ను పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో (Farmers) ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు కాకినాడ జిల్లా బయలుదేరి వెళతారు. కాగా తొలుత చంద్రబాబు ఆకివీడులో పర్యటించనున్నారని షెడ్యూలు ఖరారు చేశారు. చివరినిమిషంలో ఆకివీడు పర్యటన రద్దు చేసుకుని ఏలూరులో పర్యటనకు మార్పు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు పాకింది. కొల్లేటి సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం, పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకుని భారీ నష్టాన్ని చవిచూశాయి. చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కైకలూరు పరిధిలో నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు.
ఇటీవల ఎడతెరిపి లేని భారీ వర్షాల తాకిడికి ఏలూరు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల భవనాలు దెబ్బ తిన్నట్టు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టుకు నివేదిక అందింది. ముఖ్యంగా భవనాల పైకప్పు శ్లాబ్‌లు వర్షపు నీటితో లీకవుతున్నట్టు ఎంఈవోలు ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ మేరకు జిల్లాలో పాఠశాలల భవనాల కండిషన్‌పై కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల నుంచి క్షేత్ర స్థాయి వివరాలను సేకరించారు. జిల్లాలో మొత్తం 62 పాఠశాలల భవనాల రూప్ శ్లాబ్‌ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నట్టు తేల్చారు. మరమ్మతుల నిమిత్తం ఒక్కో భవనానికి సుమారు రూ.2 నుంచి 3 లక్షలు అవసర మవుతాయని అంచనాలను స్కూలు హెచ్‌ఎం/ఎంఈవో పంపారు. దీనికోసం మొత్తం రూ.1.10 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా. వర్షాల వల్ల ప్రభుత్వ పాఠశాలల భవనాలకు వాటిల్లిన నష్టం, మరమ్మతుల నిమిత్తం అవరమయ్యే నిధుల కోసం రూపొందించే నివేదికను ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది.
కాగా భారీ వర్షాలతో కాకినాడ జిల్లా, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి. గొల్లప్రోలు పట్నంలోని మార్కండేయపురంలోకి ఏలేరు వరద నీరు ప్రవేశించాయి. గొల్లప్రోలు పట్టణ శివారులో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై కూడా ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. గొల్లప్రోలు పట్టణ శివారులోని వేరుశెనగ మిల్లులోకి వరద నీరు ప్రవేశించింది. ఏలేరు ఒకవైపు .. శుద్ధ గడ్డ మరోవైపు ముంచెత్తడంతో పంట పొలాల్లో భారీగా ముంపుపెరిగింది. గొల్లప్రోలు జగనన్న కాలనీ సూరంపేటలకు వెళ్లే రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హరియాణాలో వినేశ్ వర్సెస్ యోగేశ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 11 , 2024 | 07:47 AM