Hariramajogaiah: మరో లేఖతో ముందుకొచ్చిన హరిరామజోగయ్య
ABN, Publish Date - Nov 01 , 2024 | 10:43 AM
Andhrapradesh: మాజీ ఎంపీ హరిరామజోగయ్య మరో లేఖతో ముందుకు వచ్చారు. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి లేఖ రాశారు. గోదావరి జిల్లాలో అభివృద్ధిపై ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలన్నారు.
పశ్చిమగోదావరి, నవంబర్ 1: గోదావరి జిల్లాల అభివృద్ధి పట్టదా అంటూ మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరి రామజోగయ్య (Former MP Hariram Jogaiah) మరో లేఖాస్త్రం సంధించారు. ఈ సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి లేఖ రాశారు. గోదావరి జిల్లాలో అభివృద్ధిపై అందులో ప్రస్తావించారు. అలాగే నరసాపురం - కోటిపల్లి రైల్వే లైన్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు, వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా ఇలా పలు అంశాలను ప్రస్తావని మాజీ ఎంపీ లేఖ రాశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు గుప్పించారు.
LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
లేఖ ఇదే..
గోదావరి జిల్లాల అభివృద్ధి పట్ల గత వైసీపీ ప్రభుత్వంలానే నేటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా అలక్ష్యం వహిస్తోందని హరిరామ జోగయ్య మండిపడ్డారు. పలు అంశాలలో గోదావరి పరివాహ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టవచ్చునంటూ మాజీ ఎంపీ సూచించారు. ఉభయగోదావరి జిల్లాలలో టెంపుల్ టూరిజం, పర్యాటక రంగం అభివృద్ధి పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. నరసాపురం- కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేయడంతో పాటు నరసాపురం - మచిలీపట్నం వరకు కొత్త రైల్వే నిర్మాణ ప్రతిపాదన చేయాలన్నారు. అంతర్వేది డ్రెడ్జింగ్ హార్బర్ కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు ఏర్పాటు కావాలని తెలిపారు.
వశిష్ట గోదావరిపై నరసాపురం సఖినేటిపల్లి, కోడేరు - అయోధ్య లంక వంతెన నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడంతో పాటు తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలన్నారు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలన్నారు. గోదావరి ప్రాంతంలో జాతీయ రహదారులన్నీ విస్తరణ చేపట్టాలంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ రాశారు.
కాగా.. ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ అనేక లేఖలు రాశారు. పలు అంశాలను ప్రస్తావించడమే కాకుండా, ఎన్నికలకు సంబంధించి కూడా లేఖాస్త్రాలు సంధించారు.. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. తిరిగి మూడు నెలల క్రితం పవన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కూడా లేఖ రాశారు మాజీ ఎంపీ. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఇరువురు నేతలు లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేసిందన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Lokesh: అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ
Read latest AP News And Telugu News
Updated Date - Nov 01 , 2024 | 01:31 PM