ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Angara Rammohan: అవినీతి ఇంకా సాగవు జోగి.. గుర్తు పెట్టుకో

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:09 PM

Andhrapradesh: మాజీ మంత్రి జోగి రమేష్‌పై బీసీ నేత, శాసన మండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబసభ్యుల అవినీతి పుట్ట కదులుతోందన్నారు. విజయవాడ శివారు అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను జోగి కుమారుడు రాజు...

Legislative Council former Whip Angara Rammohan

పశ్చిమగోదావరి, ఆగస్టు 14: మాజీ మంత్రి జోగి రమేష్‌పై (Former Minister Jogi Ramesh) బీసీ నేత, శాసన మండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ (Legislative Council former Whip Angara Rammohan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబసభ్యుల అవినీతి పుట్ట కదులుతోందన్నారు. విజయవాడ శివారు అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను జోగి కుమారుడు రాజు, వెంకటేశ్వరరావు అధికారం దుర్వినియోగంతో కొట్టేశారని ఆరోపించారు.

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు..?


మాజీ మంత్రి జోగి రమేష్‌కు అవినీతిలో భారత రత్న ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బీసీని కాబట్టే తమపై కేసులు పెట్టారని జోగి రమేష్ అంటున్నారని... జగన్ పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టి, 300 మందిని హత్య చేసినప్పుడు బీసీలు జోగికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జోగికి తన కొడుకు అరెస్టుతో కులం కార్డు గుర్తుకు వచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీ చిల్లర రాజకీయాలు, అవినీతి ఇంకా సాగవు జోగి.. గుర్తు పెట్టుకో’’ అంటూ అంగరరామ్మోహన్ హెచ్చరించారు.


అసలేం జరిగిందంటే...

కాగా... విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో సీఐడీ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసి అమ్ముకున్నారనే ఆరోపణలపై వైసీపీ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేశ్‌ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 15 మంది ఏసీబీ అధికారులు ఇబ్రహీంట్నంలోని జోగి నివాసంలో సోదాలు నిర్వహించారు. అగ్రిగోల్డ్‌ భూములను అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారని జోగి కుటుంబ సభ్యులపై ఈనెల 8న కేసు నమోదయ్యింది. అగ్రి భూముల రిజిస్ట్రేషన్‌పై పూర్తి నివేదికను సంబంధిత తహసీల్దార్‌ ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలో సోదాలు చేసిన అధికారులు ప్రధాన నిందితుడైన జోగి రాజీవ్‌ను అరెస్టు చేశారు. జోగి కుటుంబం అక్రమాలపై ఏడాది క్రితం అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో జోగి రాజీవ్‌తో పాటు 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు.

TG News: దత్తత పేరుతో హైడ్రామా... మనవడిని అమ్మేసిన నాయనమ్మ


అయితే తన కొడుకు అరెస్ట్ అన్యాయమని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్షతో ఎలాంటి తప్పు చేయని తన కొడుకును అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఇంటి మీదకు తాను దాడికి వెళ్లలేదని అయ్యన్నపాత్రుడు జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు మాత్రమే చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లానన్నారు. అది మనస్సులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ భూముల విషయంపై బహిరంగ చర్చకు సిద్దం. మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకు అయినా సిద్దం. మా వాడు విదేశాల్లో చదువుకుని ఇక్కడకు వచ్చాడు. చంద్రబాబు రాజకీయాలకు మా వాడిని బలి చేస్తున్నారు. మీకు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనేది గుర్తు ఉంచుకోండి. ఇక్కడితో అయిపోదు..‌ మాకు కూడా సమయం వస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Hyderabad: అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్‌

Steel Plant: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యక్ష పోరాటం.. షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 12:16 PM

Advertising
Advertising
<