ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు.. డెడ్‌బాడీ పార్శిల్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

ABN, Publish Date - Dec 24 , 2024 | 09:48 AM

Andhrapradesh: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన డెడ్‌ బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడికి భావిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర వర్మకు రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది.

dead body parcel case

పశ్చిమగోదావరి, డిసెంబర్ 24: జిల్లాలోని ఉండి మండలం యండగండిలో మృతదేహం పార్శిల్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర వర్మకు రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. తులసిని బెదిరించి ఆస్తి లాక్కునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

పోలీస్ స్టేషన్‌కు పుష్ప


ఈ క్రమంలో రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజును పని ఇప్పిస్తానని శ్రీధర్ తీసుకువెళ్లాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉండటంతో అతడిని హత్య చేస్తే పెద్ద గొడవ అవుతుందని నిందితుడు భావించాడు. పర్లయ్యకు కుటుంబసభ్యులు ఉన్నా.. అతడిని హత్య చేస్తే ఎవరూ పట్టించుకోరు అని శ్రీధర్ భావించాడు. అనుకున్నదే తడువుగా పర్లయ్యను హత్య చేసి తులసి ఇంటికి పార్శిల్‌గా పంపించాడు. శవపేటికలో పర్లయ్య మృతదేహాన్ని ఉంచి స్వయంగా శ్రీధర్ బాబే తీసుకువచ్చి ఓపెన్ చేసిన తరువాత కారులో పరారైనట్లు చెబుతున్నారు.

సంక్రాంతి స్పెషల్‌


మరోవైపు పోస్టుమార్టం రిపోర్టులో పర్లయ్యదే మృతదేహం అని తేలింది. ఇక మృతదేహం పార్శిల్ కేసులో శ్రీధర్ వర్మే ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటి వరకు టెక్నాలజీని ఉపయోగించి అనేక సిమ్‌లు మార్చి తిరుగుతున్న శ్రీధర్ వర్మను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో శ్రీధర్ వర్మ మూడో భార్య ఇంట్లో మరో శవపేటిక, పార్శిల్ కవర్లు లభ్యమయ్యాయి. మూడో భార్య కూడా మరో ప్రధాన నిందితురాలుగా ఉన్నట్లు సమాచారం.


డెడ్‌బాడీ పార్శిల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీధర్ వర్మను కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బంటుమిల్లు దగ్గర నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని ప్రస్తుతం భీమవరం తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే ఈకేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. పక్కా స్కెచ్‌తోనే శ్రీధర్ వర్మ ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. రాజు, పర్లయ్యను పనిలోకి కుదర్చుకున్న శ్రీధర్ వర్మ వారిలో ఒకరిని హత్య చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉండటంతో గొడవ అవుతుందని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యకు కుటుంబసభ్యులు ఉన్నా పట్టించుకోరని తెలుసుకుని అతడిని హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో పర్లయ్యను హత్య చేసి మృతదేహాన్ని పార్శిల్ రూపంలో తన వదిన అయిన సాగి తులసికి పంపించాడు. అయితే హత్యకు ముందే దానికి కావాల్సిన సామాగ్రి తెచ్చిపెట్టుకున్నాడు శ్రీధర్ వర్మ. ప్రధానంగా రెండు శవపేటికలను సిద్ధం చేయించాడు. ఒకదానిలో పర్లయ్య మృతదేహాన్ని పార్శిల్ చేసి తులసి ఇంటికి పంపించగా.. రెండో శవపేటికను శ్రీధర్ వర్మ మూడో భార్య ఇంట్లో పోలీసులు గుర్తించారు. అలాగే ఈ కేసులో నిందితుడి మూడో భార్య కూడా నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. మూడో భార్య ఇంట్లోనే పర్లయ్యను హత్య చేసి తన వదిన సాగి తులసి ఇంటికి పంపినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..

ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 09:57 AM