తెలుగు ప్రజల ఆత్మగౌరవం తెలుగుదేశం
ABN , Publish Date - Mar 29 , 2024 | 11:36 PM
తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని, తెలుగుదేశం పార్టీతో తెలుగు వారి గౌరవం విశ్వవ్యాప్తమైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుడు అన్నారు.

జిల్లాలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ఉంగుటూరు, మార్చి 29: తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని, తెలుగుదేశం పార్టీతో తెలుగు వారి గౌరవం విశ్వవ్యాప్తమైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉంగుటూరు సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రరావు, చింతల శ్రీనివాస్, ఉన్నమట్ల సునీత, నోచర్ల శ్రీను, బండారు మధు, నేకూరి ఆశీర్వాదం, ఇమ్మణ్ణి గంగాధరరావు, తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు: ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు క్యాంపు కార్యాలయంలో టీడీపీ జెండా ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త, టీడీపీ నాయకులు పార్టీ అభి వృద్ధికి కృషి చేయాలని గన్ని కోరారు. జనసేన, టీడీపీ, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దెందులూరు: టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంపం గి వేణుగోపాల్ తిలక్,కొలుసు నాని టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ చిత్రపటానికి యిప్పిలి వెంకటేశ్వరావు, గారపాటి కొండయ్య చౌదరి పూలమా ల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ ఏసమ్మ, ఎంపీటీసీ శేషారత్నం, మహే్ ష యాదవ్, దాసే శ్రీను, జహీర్, ఉప సర్పంచ్ మురళీకృష్ణ పాల్గొన్నారు. పోతునూరులో బోడేటి మోహన్‌బాబు, నున్న లక్ష్మణ్‌బాబు, గాలాయగూ డెంలో పూజారి శ్రీనివాసరావు, ఏనుగు రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ అవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
కుక్కునూరు: టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. కోటగిరి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత పేదలకు కూడు, గూడు, గుడ్డ, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవ కాశాలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించారన్నారు. చంద్రబాబు నాయక త్వంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. వంటిపల్లి గంగరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉపసర్పంచ్ పిచ్చుక రాజు, బాలాజీ, సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్ అన్నారు. చింతలపూడి, ప్రగడవరం, వెంకటాపురం, రేచర్ల గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. రోషన్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. జగ్గవరపు ముత్తారెడ్డి, పక్కాల వెంకటేశ్వరరావు, కోండ్రు దేవ, బోడా అనిష్‌కుమార్, చిట్లూరి ధర్మరాజు, టి. అప్పారావు, బోడా నాగభూషణం, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.నాగరాజు, కె.రాజశే ఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, కె.ఉపేంద్ర, సూరానేని గోపి, ఆది జగన్, జనసేన నాయకులు చీదరాల మఽధుబాబు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదవేగి: టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మహనీయుడని ఈడ్పుగంటి సుందరయ్య అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడు కలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. పార్టీ నాయకులు పెదర్ల రాంబాబు, దారిబోయిన సత్యనారాయణ, బిర్లంగి పెద్దులు, వీరంకి నాగరాజు, షేక్ హుస్సేన్, దుక్కిపాటి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతీ ఒక్కరు ఎన్‌టీఆర్ ఆశాయాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు జ్యేష్ట రామకృష్ణ, తెలుగు మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శి మేఘలాదేవి, బలుసు నాగేశ్వరరావు, బెల్లాని శ్రీను, తదితర నాయకులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహానికి సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు పూలదండ వేసి ఘన నివాళులర్పించారు. రావూరి కృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెనుమర్తి రామ్‌కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, బుట్టాయ గూడెం రోడ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచం ద్రరాజు, శ్రీనివాసపురం రోడ్డులోని లక్ష్మీనారాయణ థియేటర్ ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద కౌన్సిలర్స్ కరటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి జెండాలు ఆవిష్కరించారు. బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలిం గేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, షేక్ ముస్తఫా, కొంచాడా ప్రసాద్, తూటికుంట దుర్గారావు, జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య, బొబ్బర్ రాజ్ పాల్ కుమార్, పగడం సౌభాగ్యవతి, మారిశెట్టి బాల చిట్టమ్మ, చిట్రోజు తాతాజీ, తూటికుంట రాము, జనసేన కౌన్సిలర్ వలవల తాతాజీ, షేక్ పీరు, కొండ్రెడ్డి కిషోర్, అల్లూరి రామకృష్ణ, చేను ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.