TDP Vs YCP: అర్ధరాత్రి వైసీపీ మూకల బీభత్సం.. చింతమనేని అనుచరులపై పైశాచిక దాడి.. ఎందుకంటే?
ABN, Publish Date - Jan 31 , 2024 | 10:58 AM
Andhrapradesh: జిల్లాలోని పెదవేగి మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు.
ఏలూరు, జనవరి 31: జిల్లాలోని పెదవేగి మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Former MLA Chintamaneni Prabhakar) అడ్డుకున్నారు. చింతమనేని రాకతో లోడింగ్ పాయింట్ వద్దే టిప్పర్లు, జేసీబీలను వదిలేసి గ్రావెల్ మాఫియా పరారైంది. అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై ఆర్డీవోకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పి చింతమనేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే పెదవేగి పోలీసులు, రెవిన్యూ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఒక్కసారిగా దూసుకొచ్చిన వైసీపీ గుండాలు..
అయితే చింతమనేని వెళ్లిపోయారని సమాచారం అందుకున్న వెంటనే వైసీపీ గూండాలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు వివరాలు నమోదు చేస్తూ ఉండగానే టీడీపీ నాయకులపై (TDP Leaders) దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే చింతమనేని అనుచరులపై కర్రలు, రాడ్లతో పైశాచికంగా దాడి చేశారు. వైసీపీ మూక పలు కార్లను ధ్వంసం చేసింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తూ నిల్చోవడం విమర్శలకు దారి తీసింది.
ధీటుగా పోరాడిన తెలుగు తమ్ముళ్లు...
మరోవైపు వైసీపీ మూకల దాడిని టీడీపీ నాయకులు, చింతమనేని అనుచరులు తీవ్రంగా ప్రతిఘటించారు. దాదాపు గంటన్నరకుపైగా వైసీపీ దాడుల పర్వం సాగింది. ఈ దృశ్యాలను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులను వైసీపీ నేతలు బెదిరించి మరీ వీడియోలు డిలీట్ చేయించారు. జెడ్పీ చైర్మన్ భర్త ఘంటా ప్రసాద్, వైసీపీ నాయకులు కామిరెడ్డి నాని సహా పలువురు వైసీపీ నాయకులు ఘటనా ప్రాంతంలోనే ఉన్నారు. ధ్వంసం అయిన కార్లను పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఘటనా ప్రాంతం నుంచి క్రేన్లతో తొలగించారు. అయితే వైసీపీ పైశాచిక దాడులను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 31 , 2024 | 11:14 AM