ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: కోడ్‌ ఉంటే నాకేంటి!?

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:22 AM

విద్యాసంవత్సరం చివరి రోజైన ఏప్రిల్‌ 23న పేరెంట్స్‌-టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ హెడ్‌మాస్టర్లు, టీచర్లకు ఆదేశాలిస్తూ ఫోన్‌ సందేశాలు పంపారు. ఈ సమావేశంలో తల్లిదండ్రుల హాజరు 100 శాతం ఉండాల్సిందేనని కచ్చితంగా చెప్పారు. ఈ రోజు నుంచి

  • ఎన్నికల వేళ విద్యాశాఖ పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌!

  • హెడ్‌మాస్టర్లకు, టీచర్లకు ప్రవీణ్‌ ప్రకాశ్‌ సందేశం

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం చివరి రోజైన ఏప్రిల్‌ 23న పేరెంట్స్‌-టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ హెడ్‌మాస్టర్లు, టీచర్లకు ఆదేశాలిస్తూ ఫోన్‌ సందేశాలు పంపారు. ఈ సమావేశంలో తల్లిదండ్రుల హాజరు 100 శాతం ఉండాల్సిందేనని కచ్చితంగా చెప్పారు. ఈ రోజు నుంచి 22వతేదీ వరకు ప్రతిరోజూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమావేశం గురించి గుర్తుచేస్తూ ఉంటే 100 శాతం హాజరు సాధ్యపడుతుందని సలహా కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులను నేరుగా తల్లిదండ్రులకే అందజేయాలని ఆదేశించారు. అయితే, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఈ తరహా సమావేశాలు కోడ్‌ ఉల్లంఘన కిందకి వస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో జరగబోయే సమావేశం కావున, ప్రభుత్వ విధానాల గురించి చర్చకు వచ్చే అవకాశాలే ఉంటాయి. పైగా ఒక్కో పాఠశాలలో వందల మంది విద్యార్థులుంటారు. అంటే ఈ సమావేశాలకు హాజరయ్యే తల్లిదండ్రులు కూడా వందల సంఖ్యలో ఉంటారు. కావున, ఇలాంటి సమావేశాలు నిర్వహించడం పరోక్షంగా అధికారపార్టీకి ప్రచారం కల్పించడమేనన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 10:18 AM

Advertising
Advertising