Woman Wins : కరువు భత్యం కోసం న్యాయపోరాటం
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:34 AM
చట్టబద్ధంగా తనకు రావాల్సిన కరువు భత్యం కోసం ఓ మహిళా చిరుద్యోగి చేసిన సుదీర్ఘ పోరాటం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం..
17,36,543 చెల్లించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): చట్టబద్ధంగా తనకు రావాల్సిన కరువు భత్యం కోసం ఓ మహిళా చిరుద్యోగి చేసిన సుదీర్ఘ పోరాటం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జోక్యంతో పరిష్కారమయింది. జల వనరుల శాఖలో టైపిస్టుగా అవుట్ సోర్సింగ్ విధానంలో కె.హరిప్రియ చేరారు. 2012లో ఆమె సర్వీసును రెగ్యులరైజ్ చేశారు. నాటి నుంచి మూల వేతనంపై 47.936ు చొప్పున కరువు భత్యం చెల్లించాలంటూ హరిప్రియ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటూ వచ్చారు. పదవీ విరమణ నాటికి ఆమొత్తం రూ.12,35,121లకు చేరుకుంది. దీనికోసం ఆమె హైకోర్టు తలుపు తట్టారు. వాదోపవాదనలు ముగిసిన తరువాత వడ్డీతో సహా రూ.17,36,541 చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం పేర్కొన్న మొత్తాన్ని హరిప్రియకు చెల్లించాలం టూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు.
Updated Date - Dec 18 , 2024 | 06:34 AM