AP Elections 2024: ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నాం: ముకేష్ కుమార్ మీనా
ABN, Publish Date - Apr 27 , 2024 | 09:49 AM
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్నారు. మొదటిసారిగా ఓటు వేస్తున్న యువతతో గుంటూరులో శనివారం ఉదయం లెట్స్ ఓట్ 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు.
గుంటూరు: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్నారు.
మొదటిసారిగా ఓటు వేస్తున్న యువతతో గుంటూరులో శనివారం ఉదయం లెట్స్ ఓట్ 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు.
YSRCP: వైసీపీ అభ్యర్థికి షాక్.. అసమ్మతి వర్గం ఘాటు లేఖ
ఈ రన్ లో పాల్గోన్న ముకేష్ మాట్లాడుతూ.. "దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడం యువత బాధ్యత. 18 ఏళ్ల నిండినవారు ఓటు హక్కును నమోదు చేసుకోవటమే కాదు తప్పనిసరిగా ఓటు వేయాలి. ప్రజాస్వామ్య దేశంలో పోలింగ్ రోజే అసలైన పండగ. ఈ పండగలో యువత తప్పనిసరిగా పాల్గొనాలి. దేశంలో అనేక ప్రాంతాలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఓటింగ్ శాతం చాలా మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటింగ్ శాతం 82 శాతానికిపైగా ఉండేలా కృషి చేస్తున్నాం" అని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 27 , 2024 | 10:30 AM