ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రధాని అడ్డుకోకుంటే!

ABN, Publish Date - Oct 06 , 2024 | 06:00 AM

తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్‌ సర్కార్‌ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సూదన్‌ విషయంలో గతంలో ఇది జరిగింది.

  • మాజీ ఐఏఎస్‌ ప్రీతి సూదన్‌పై గతంలో చర్యలకు సిద్ధమైన జగన్‌ సర్కార్‌

  • 15 ఏళ్ల క్రితం నాటి సెలవుల విషయంలో షోకాజ్‌ నోటీసులు

  • వివాదమేమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ

  • ఏకంగా ప్రధాని మోదీ వద్దకు ఫైల్‌

  • సమర్థురాలైన అధికారిపై చర్యలా?

  • మోదీ ఆగ్రహంతో జగన్‌ సర్కార్‌ వెనక్కి

న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్‌ సర్కార్‌ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సూదన్‌ విషయంలో గతంలో ఇది జరిగింది. 15 ఏళ్ల క్రితం నాటి సెలవుల విషయంలో ఆమెపై జగన్‌ సర్కార్‌ వేధింపులకు గురి చేసి, క్రమశిక్షణా చర్యలు తీసుకొనేందుకు సిద్ధమైంది.

అయితే ఒక సమర్థురాలైన అధికారి విషయంలో ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకొని, ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ సర్కార్‌ వెనక్కు తగ్గినట్టు తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కొవిడ్‌ సమయంలో ప్రీతి సూదన్‌ సమర్థవంతమైన పాత్ర నిర్వహించారు. 2020 జూలై వరకు ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రీతి సూదన్‌ సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తర్వాత రెండేళ్లు ఉపయోగించుకుంది.


  • రిటైరైన ఏడు నెలల తర్వాత..

ప్రీతి సూదన్‌ 2005 మార్చి 1న ఏపీ రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న సమయంలో అమెరికాలో పనిచేస్తున్న తన భర్త రణదీప్‌ సూదన్‌ వద్దకు వెళ్లారు. ప్రపంచబ్యాంకు డెవల్‌పమెంట్‌ రిసెర్చ్‌ యూనిట్‌లో అధ్యయనం చేసేందుకు అనుమతి కూడా పొందారు. 2006 మే 31 వరకు తన సెలవును పొడిగించారు. పదవీ విరమణకు ముందు ఆ సెలవులను సర్దుబాటు చేసుకునేందుకు ప్రీతి తన అసాధారణ లీవును తన శాఖ ద్వారానే ఎర్న్‌డ్‌, సగం జీతం సెలవుగా మార్చుకున్నారు.

అయితే ఆమె రిటైర్‌ అయినప్పుడు మాట్లాడని జగన్‌ ప్రభుత్వం ఏడు నెలల తర్వాత అధికార దుర్వినియోగంతో సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా అసాధారణ లీవును ఎర్న్‌డ్‌ లీవు, సగం జీతం సెలవుగా మార్చుకున్నారంటూ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ విషయం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, పింఛన్ల శాఖ దృష్టికి వెళ్లింది. తమకు ప్రీతి సూదన్‌ లేఖ రాసి సెలవు విషయం తెలిపారని, వివాదం ఏమీ లేదని స్పష్టం చేసింది. మోదీ వద్దకు ఫైలు వెళ్లినప్పుడు ఆమెపై ఎలాంటి చర్యకు ఆస్కారం లేదని, సమర్థురాలైన ఒక అధికారి వెంట జగన్‌ ప్రభుత్వం పడడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


  • చంద్రబాబు హయాంలో కీలక బాధ్యతలే కారణమా?

ప్రీతి సూదన్‌ను కేంద్రం తొలుత యూపీఎస్సీ సభ్యురాలిగా, 2024 ఆగస్టు 1న చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆమె భర్త రణదీప్‌ సూదన్‌ ప్రస్తుతం ప్రపంచబ్యాంకు ఐటీ, కమ్యూనికేషన్ల విభాగంలో ప్రాక్టీస్‌ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచబ్యాంకుకు వెళ్లకముందు రణదీప్‌ చంద్రబాబు హయాంలో ఈ-పాలన, ఐటీ ఆధారిత సేవల విషయంలో కీలక సేవలందించారు. ప్రీతి సూదన్‌ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

జగన్‌ హయాంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ అప్పటి చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ ద్వారా ప్రీతి సూదన్‌కు షోకాజ్‌ నోటీసు ఇప్పించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ఆమెపై ఫిర్యాదు ఫైలును మూసివేయించడంతో జగన్‌ సర్కార్‌ చేసేదేమీ లేకపోయింది. కాగా, తమకు సన్నిహితురాలైన శ్రీలక్ష్మీకి ఏకంగా మూడు ప్రమోషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించినందుకు రెడ్డి సుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్‌ అధికారిని కూడా జగన్‌ ప్రభుత్వం వేధించినట్లు ఒక అధికారి చెప్పారు.

Updated Date - Oct 06 , 2024 | 06:01 AM