ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSR Congress: వైసీపీకి మరిన్ని ఝలక్‌లు.. టీడీపీలోకి వలసలు

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:20 PM

ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని గెలవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్న ఆ పార్టీ.. సొంత నాయకులనే కాపాడుకోలేక సతమతమవుతోంది. తన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడాన్ని నివారించలేకపోతోంది.

ఎన్నికల ముందు అధికార వైసీపీకి (YCP) వరుస దెబ్బలు తగులుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని గెలవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్న ఆ పార్టీ.. సొంత నాయకులనే కాపాడుకోలేక సతమతమవుతోంది. తన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడాన్ని నివారించలేకపోతోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్ (YS Jagan) తీరుతో విసుగెత్తిపోయిన ఆ పార్టీ నేతలు.. విపక్ష కూటమిలో వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది జనసేన, తెలుగుదేశం పార్టీల్లోకి చేరగా.. తాజాగా పల్నాడు జిల్లాలోని గుజరాల నియోజకవర్గంలోనూ వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దాచేపల్లి మాజీ ఎంపీపీ అంబటి శేషగిరి రావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్యలు తమ అనుచరులతో కలిసి మంగళవారం టీడీపీలోకి చేరారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు వారిని తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

MLC Kavitha: కవితకు ఆ పుస్తకం ఎందుకు? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?


అంతకుముందు.. భీమిలిలోనూ మూకుమ్మడి రాజీనామాలు నమోదయ్యాయి. భీమిలి మండల జెడ్‌పీటీసీ గాడువెంకటప్పడు, సింగనబంద సర్పంచ్ గాడు వెంకటనారాయణ, ఎంపీటీసీ తుపాకుల పైడిరాజు, ముగ్గురు ఉప సర్పంచ్‌లు, పీఏసీఎస్ డైరెక్టర్ గాడు తాతినాయుడు, ఎనిమిది పంచాయతీలకు చెందిన ఐదుగురు మాజీ సర్పంచ్‌లు, ఐదుగురు మాజీ ఎంపీటీసీలు, ఆరుగురు సచివాలయ కన్వీనర్లు, 32 మంది వార్డ్ మెంబర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విధివిధానాలు నచ్చకపోవడం వల్లే తాము రాజీనామా చేసినట్లు వాళ్లు తెలిపారు. అలాగే.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో మోమిన్ కుటుంబ సభ్యులు టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో.. ఆత్మకూరులో మైనార్టీల్లో టీడీపీకి మరింత బలం పెరిగినట్టు అయ్యింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 08:21 PM

Advertising
Advertising