మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:45 AM

ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు రోజురోజుకూ ఎక్కువవుతోంది. వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. వలంటీర్లను.. వైసీపీ నాయకులను కలవమని ఎమ్మెల్వో అధికారి చెబుతున్నారు. వలంటీర్‌లందరూ రిజైన్ చేయాలని వాట్సాప్ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు.

YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు

ఏలూరు: ద్వారకా తిరుమలలో వైసీపీ (YSRCP) నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు రోజురోజుకూ ఎక్కువవుతోంది. వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. వలంటీర్లను.. వైసీపీ నాయకులను కలవమని ఎంఎల్ఓ అధికారి చెబుతున్నారు. వలంటీర్‌లందరూ రిజైన్ చేయాలని వాట్సాప్ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు. రిజైన్ చేసిన వాళ్లనే ఎలక్షన్ తర్వాత కంటిన్యూ చేస్తామని ఎంఎల్‌ఓ అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారు. చేసేది లేక ద్వారకా తిరుమల మండలంలో 27 మంది వలంటీర్ల రాజీనామా చేశారు.

PM Modi: ఈ శుభ సందర్భంలో నా మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది.. ప్రధాని మోదీ


ఎంఎల్ఓ అధికారి జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో పనిచేస్తారని ఎంపీడీవో చెబుతున్నారు. వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు వలంటీర్లలతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తూ.. మరోవైపు వలంటీర్లే స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. జగన్‌తోనే ఉంటామని.. ఉద్యోగానికి రాజీనామా చేసైనా ఆయనను గెలిపించుకుంటామని రాజీనామాలు చేస్తున్నారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Tulasireddy: జగన్ రెడ్డి కాదు - జలగ రెడ్డి

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 11:52 AM

Advertising
Advertising