AP Elections 2024: పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎమ్మెల్యే
ABN, Publish Date - May 13 , 2024 | 10:29 AM
ఏపీలో ఎన్నికల వేళ(ap elections 2024) పలు చోట్ల ప్రశాంతంగా ఓటింగ్(voting) జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా(kakinada district) అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు.
ఏపీలో ఎన్నికల వేళ(ap elections 2024) పలు చోట్ల ప్రశాంతంగా ఓటింగ్(voting) జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా(kakinada district) అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఏకంగా ఓటర్లను బెదిరిస్తున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అయితే పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ బీఎల్వో ముసుగులో వైసీపీ(YSRCP) కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే సమాచారం తెలుసుకున్న అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ వైసీపీ శ్రేణులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని పెదపూడి పోలీస్ స్టేషన్లో(police station) అప్పగించారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే
AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన
Read Latest AP News And Telugu News
Updated Date - May 13 , 2024 | 10:32 AM