ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPI : వైసీపీ కార్యాలయాలను ప్రజావసరాల కోసం కేటాయించాలి

ABN, Publish Date - Jun 30 , 2024 | 05:20 AM

ప్రభు త్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.

  • బాబు కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేస్తారు: రామకృష్ణ

  • ఎస్వీయూలో ఏఐఎ్‌సఎఫ్‌ మహాసభలు

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), జూన్‌ 29: ప్రభు త్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో శనివారం ప్రారంభమై న ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కేంద్రం నుంచి చంద్రబాబు తగినన్ని నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రజాభిమానాన్ని కోల్పోయిన జగన్‌ ప్రతిపక్ష హో దా కావాలని అడగటం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ కార్యదర్శి దినేశ్‌ శ్రీరంగరాజ్‌, జాతీయ ఉపాధ్యక్షుడు సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో దేశంలోని విద్యారంగ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన ఉద్యమ ప్రణాళికను రూపొందించనున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 06:51 AM

Advertising
Advertising