ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సజ్జల డైరెక్షన్‌

ABN, Publish Date - Nov 12 , 2024 | 05:10 AM

వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా సజ్జల భార్గవ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే బూతులు పెరిగాయని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ పేర్కొన్నారు.

వైసీపీ సోషల్‌ మీడియా యాక్షన్‌

సజ్జల భార్గవ్‌ రెడ్డి ఆధ్వర్యంలోనే బూతు, నీచ పోస్టులు

వర్రా రవీంద్రా రెడ్డి సోషల్‌ మీడియాలో వికృత పోస్టులు పెట్టడంలో సిద్ధ హస్తుడు. ఇదంతా అతను వ్యక్తిగతంగా చేసింది కాదు. వ్యవస్థీకృతంగా, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రతి జిల్లాకు ఒక గ్రూప్‌ కన్వీనర్‌ ఉంటారు. వీళ్లకు తాడేపల్లి నుంచి దిశా నిర్దేశం వస్తుంది. కొన్ని పోస్టులు సొంతంగా పెడతారు. మరికొన్ని పైనుంచి వచ్చే సూచనల మేరకు పెడతారు.

- డీఐజీ కోయ ప్రవీణ్‌

40 యూట్యూబ్‌ చానళ్లు... 400 పైగా అకౌంట్లు

ఇతర వ్యక్తుల ఖాతాల నుంచీ వైసీపీ పోస్టులు

డిజిటల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది సొంతానికి వాడకం

పార్టీ సోషల్‌ మీడియా ఆఫీసు నుంచే తతంగం

సునీత, షర్మిలపై పోస్టుల వెనుక అవినాశ్‌ రెడ్డి

ఆయన డిక్టేషన్‌తో పీఏ రాఘవ రెడ్డి కంటెంట్‌

దానినే వర్రా రవీంద్రా రెడ్డి పోస్ట్‌ చేశాడు

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ వెల్లడి

వర్రా రవీంద్రా రెడ్డి అరెస్టు

సహకరించిన మరో ఇద్దరూ

కడపలో మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు

కడప (క్రైం), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా సజ్జల భార్గవ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే బూతులు పెరిగాయని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ పేర్కొన్నారు. షర్మిల, సునీత, వైఎస్‌ విజయలక్ష్మిపై పోస్టుల వెనుక ఎంపీ అవినాశ్‌ రెడ్డి ‘డిక్టేషన్‌’ ఉన్నట్లు తేలిందన్నారు. సోషల్‌ మీడియాలో కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్న ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరుడు, జగన్‌ సతీమణి భారతీరెడ్డి పీఏ వర్రా రవీంద్రారెడ్డితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని ప్రకటించారు. ఈ ముగ్గురినీ సోమవారం కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుతో కలిసి డీఐజీ కోయ ప్రవీణ్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. సోషల్‌ మీడియాలో వైసీపీ వికృత చేష్టలన్నీ... సజ్జల భార్గవ్‌ రెడ్డితోపాటు అర్జున్‌రెడ్డి, వీరారెడ్డ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయని డీఐజీ తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, హోం మంత్రి, ఇతర మహిళా నేతలపై సోషల్‌ మీడియాలో వీళ్లు వాడిన భాష నీచం, ఘోరం! గల్ఫ్‌ దేశాలలో అయితే ఊరిమధ్యలో పెట్టి రాళ్లతో కొట్టే శిక్ష విధించే వారు. మీడియా సమక్షంలో ఆ పోస్టులను చదివేందుకు నా సభ్యత, సంస్కారం అడ్డు వస్తున్నాయి. వర్రా రవీంద్రరెడ్డి భారతీ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుండే వాడు. 2012లో ఉద్యోగం మానేశాడు. అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవరెడ్డిని డిజిటల్‌ కార్పొరేషన్‌ అధిపతిగా నియమించింది. వైసీపీ సోషల్‌ మీడియాలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైసీపీ సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌గా వివేకానంద రెడ్డి, కో కన్వీనర్‌గా వర్రా రవీంద్రా రెడ్డి ఉండేవారు. సజ్జల భార్గవ్‌రెడ్డి చేతుల్లోకి వైసీపీ సోషల్‌ మీడియా వెళ్లాక వీరందరి బూతుపురాణం ప్రారంభమైంది. ‘జగనన్న కనెక్ట్‌’ పేరుతో వైసీపీ సోషల్‌ మీడియా విభాగం నడిచింది. దానికి 2022 నుంచి సజ్జల భార్గవ రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నారు. భార్గవ్‌ రెడ్డితోపాటు మరికొందరి ఆదేశాల మేరకు ఇతరులు పని చేస్తారు. మూడు రాజధానుల విషయంలో జడ్జిలపై కూడా పోస్టులు పెట్టారు. సోషల్‌ మీడియాలో వీరి వికృత చేష్టలు చెప్పలేం. ఇవన్నీ సజ్జల భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డి, వీరారెడ్డ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయి.

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌తోపాటు మరో కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగులను నియమించుకుని... వారిని వైసీపీ సోషల్‌ మీడియా కోసం వాడుకున్నారు. వీరిలో ఐడ్రీమ్‌ నుంచి 60 మంది, అవినాశ్‌ రెడ్డి పీఏ బండి రాఘవ రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి ద్వారా 65 మంది ఉన్నారు. వీరికి అప్పటి ప్రభుత్వం నుంచి నిధులు మళ్లించి డబ్బులు ఇచ్చే వారు. వీరికి 40 యూట్యూబ్‌ చానళ్లు ఉన్నాయి. 400లకుపైగా సోషల్‌ అకౌంట్‌ హ్యాండిల్స్‌ను నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పీవీఎస్‌ ఐకాన్‌ బిల్డింగ్‌ మూడో ఫ్లోరులోని వైసీపీ సోషల్‌ మీడియా కార్యాలయం నుంచి మొత్తం కార్యకలాపాలు జరిపారు. ఈ ముఠాలో 45 మందిని గుర్తించాం. పంచ్‌ ప్రభాకర్‌, జగనన్న సైన్యం (వెంకటేశ్‌ బాడి), ఇడ్లీ సాంబార్‌ (హరికృష్ణా రెడ్డి), రెడ్డిగారి అమ్మాయి వంటి ఖాతాలతోపాటు... బేతంపూడి నాని, కేసరి రాజశేఖర్‌ రెడ్డి, ఇందుకూరి శ్రీనివాసరాజు, రామాల మన్విత్‌ కృష్ణా రెడ్డి, మలకా అమరనాథ్‌ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్‌, షేక్‌ జాను, జగదీశ్వర్‌ రెడ్డి ఆళ్ల, శ్రీనివాసరెడ్డి, జింకల రామాంజనేయులు, ఎన్‌.బాలాజీ రెడ్డి, భార్గవ రెడ్డి, మునగాల హరీశ్వర్‌ రెడ్డి... తదితరులు సోషల్‌ మీడియాలో జుగుప్సాకరమైన సందేశాలు పోస్టు చేసినట్లు విచారణలో గుర్తించాం. కొందరి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు తీసుకుని వారి పేరుతో వైసీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలోనే కొన్ని పోస్ట్‌లు పెట్టేవారు.


అవినాశ్‌ రెడ్డి ‘డిక్టేషన్‌’తో...

ఎంపీ అవినాశ్‌ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వాట్సాప్‌ ద్వారా పంపిన ‘కంటెంట్‌’ను సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీంద్రా రెడ్డి తన వాంగ్మూలంలో అంగీకరించాడు. అవినాశ్‌ రెడ్డి చెప్పింది రాసుకుని దానినే రాఘవరెడ్డి తనకు పంపించేవాడని వర్రా చెప్పాడు. షర్మిల, వైఎస్‌ సునీత, వైఎస్‌ విజయలక్ష్మిపై పెట్టిన పోస్టులు అవేనని తెలిపాడు. పులివెందులకు చెందిన ఒక వ్యక్తి అప్పటి సీఎంను ప్రశ్నిస్తే కులం పేరుతో అతడిని దూషించారు. మంద కృష్ణ తల్లిపై అసభ్యకరంగా వారు పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించి బండి రాఘవరెడ్డిపై కూడా కేసు నమోదు చేశాం. షర్మిల, సునీతల పోస్టులకు సంబంధించిన కేసులు తెలంగాణలో ఉన్నాయి. అవి ఇక్కడికి బదిలీ అయితే రాఘవరెడ్డిపై చర్యలు తీసుకుంటాం. సుమోటో కింద కేసు నమోదు చేయలేం. వర్రాపై రాష్ట్రవ్యాప్తంగా 40 కేసులు ఉన్నాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లోనే 10 కేసులు ఉన్నాయి. వర్రాను మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి కోరుతాం.

అరెస్టు ఇలా...

కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నాలుగురోజుల క్రితం వర్రాకు 41ఏ నోటీసు ఇచ్చాము. రాజంపేటకు సంబంధించిన కేసులో వర్రాను కస్టడీలోకి తీసుకోలేక పోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆదివారం మార్కాపురం వద్ద వర్రా రవీంద్రరెడ్డితో పాటు అతడికి సహకరించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లికి చెందిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లికి చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌ రెడ్డిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నాం!

Updated Date - Nov 12 , 2024 | 05:10 AM