AP Elections 2024: వైసీపీ కార్యకర్తలు యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ABN, Publish Date - May 09 , 2024 | 12:20 PM
ఏపీ(AP)లో మరో మూడు రోజల తర్వాత మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్(poling) జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా(ap elections 2024) ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి(YSRCP) చెందిన నేతలు తాజాగా మచిలీపట్నంలో యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఏపీ(AP)లో మరో మూడు రోజల తర్వాత మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్(poling) జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా(ap elections 2024) ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి(YSRCP) చెందిన నేతలు తాజాగా మచిలీపట్నంలో యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రచారం పేరుతో పలువురు వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గోడలు, తలుపులకు సీఎం జగన్ సిద్ధం స్టిక్కర్లు(siddham posters) అంటిస్తున్నారు.
అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్థానిక ప్రజలకు ఇచ్చే కరపత్రానికి సైతం ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకోవాలి. కానీ అలాంటివి మాత్రం పట్టించుకోకుండా విచ్చలవిడిగా వైసీపీ కార్యకర్తలు ఇలా ప్రచారం చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
అయితే ఎన్నికల ప్రచారనికి సంబంధించి ఏదైనా కరపత్రాల ఖర్చు అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖర్చుల్లో చూపాలి. కానీ మచిలీపట్నం(machilipatnam)లో మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా సీఎం జగన్ ఫోటోతో ఉన్న సిద్ధం స్టిక్కర్లు అంటిస్తూ ఎన్నికల కోడ్ పాటించడం లేదు. మరోవైపు ఇదంతా జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. అధికారులు వాటిని చూసినా కూడా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసినా కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇక్కడే కాదు ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
AP Elections: తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేదు.. ఏపీకి ఇంకేం చేస్తావ్ జగన్?
Andhra Pradesh : ‘హోం ఓటింగ్’ వద్ద వైసీపీ రచ్చరచ్చ
Read more AP News and Telugu News
Updated Date - May 09 , 2024 | 12:23 PM