Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరో తెలుసా..

ABN, Publish Date - Jul 08 , 2024 | 01:48 PM

ప్రణీత్ హనుమంతు పేరు గత రెండు రోజులుగా సామాజిక మాద్యమాల్లో ఎక్కువుగా వినిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా కొంతమందికి సుపరిచితుడైన ప్రణీత్. నటుడిగా ఎక్కువమందికి తెలియదు.

Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరో తెలుసా..
Praneet Hanumanthu

ప్రణీత్ హనుమంతు.. ఈ పేరు గత రెండు రోజులుగా సామాజిక మాద్యమాల్లో ఎక్కువుగా వినిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా కొంతమందికి సుపరిచితుడైన ప్రణీత్. నటుడిగా ఎక్కువమందికి తెలియదు. కానీ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో కొన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. ఈక్రమంలో అతడు చేసిన ఓ పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐఎఎస్ అధికారి హనుమంతు అరుణ్‌కుమార్‌ ఏపీ ప్రజలకు సుపరిచితుడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్‌ కుమార్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా అరుణ్ కుమార్ కూడా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు. అరుణ్‌ కుమార్ కుమారుడే ప్రణీత్. ఆయన గత కొంతకాలంగా యూట్యూబ్‌ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు.

Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!


అసలేం జరిగింది..?

అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద... తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ... ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. దీనిపై అతడి బ్యాచ్ నీచమైన కామెంట్స్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయంపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. ఆయన తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్, నిర్మాత అహితేజ బెల్లంకొండతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించడంతో ప్రణీత్ పేరు సామాజిక మాద్యమాల్లో మారుమోగుతోంది. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ సాయి ధరమ్ తేజ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, తెలుగు రాష్ట్రాల డీజీపీలు స్పందించారు. ప్రణీత్‌పై కేసు నమోదు చేశామని తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో తాను ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని.. తనను క్షమించాలని ప్రణీత్ కోరాడు.

TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర


సినిమాల్లో ప్రణీత్..

ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యారు. 'ఏ జూడ్' ఛానల్‌ను ప్రణీత్ సోదరుడు అజయ్ హనుమంతు నడిపిస్తున్నాడు. ప్రణీత్‌కు అజయ్ అన్నయ్య. ప్రణీత్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన హరోం హరలో ప్రణీత్ హనుమంతు నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు. హరోం హర కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఒరిజినల్ ఫిల్మ్ మై డియర్ దొంగలో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు. ఇలా సినిమాల్లో నటించిన ప్రణీత్ హనుమంతు తన అతి వల్ల ప్రస్తుతం తన అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Amaravati : సంక్షోభంలో ఇంధనం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 08 , 2024 | 02:01 PM

Advertising
Advertising
<