Foreign Tour: విదేశాలకు వైఎస్ జగన్ దంపతులు
ABN, Publish Date - May 08 , 2024 | 03:53 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
అమరావతి, మే 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది
సీఎం వైయస్ జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే నాంపల్లిలోని సీబీఐ కోర్టు నుంచి అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది. ఆ క్రమంలో వైఎస్ జగన్.. తన విదేశీ ప్రయాణ అనుమతి కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేశారని తెలుస్తుంది. మే 15వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు వైయస్ జగన్ దంపతులు లండన్‌తోపాటు అమెరికాలో పర్యటించనున్నారని పార్టీలు పేర్కొంటున్నాయి.
వైయస్ జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు లండన్‌లో.. మరొకరు అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పక్షం రోజులు జగన్ దంపతులు.. వారి కుమార్తెల వద్ద ఉండనున్నారని తెలుస్తుంది. అయితే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అప్పటికి వైఎస్ జగన్ తన విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకొనున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సీఎం వైయస్ జగన్.. తన ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.
LokSabha Elelctions: రాయ్‌బరేలీలో కొత్త శకం ఆరంభం: ప్రియాంక
మే 13వ తేదీన అసెంబ్లీకి, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన మరునాడే .. లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తుతం.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద ఉన్నారు. మరి విదేశీ ప్రయాణంలో భాగంగా.. వైఎస్ జగన్ దంపతలు విజయమ్మ వద్దకు వెళ్తారా? లేదా ? అని సందేహాలు సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.
Read Latest National News and Telugu News
Updated Date - May 08 , 2024 | 04:06 PM