YS.Sharmila: జగన్ అవినీతిపై మౌనం ఎందుకు.. బీజేపీకి షర్మిల సూటి ప్రశ్న
ABN, Publish Date - Feb 28 , 2024 | 04:03 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతి పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర మాఫియా జరుగుతోందన్న విషయం కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుసన్న ఆమె.. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమని పైర్ అయ్యారు. పరోక్షంగా జగన్ బీజేపీతోనే ఉన్నారు కాబట్టి చర్యలు లేవన్ని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా అవినీతి జరగలేదని బీజేపీ చెప్పగలదా అని షర్మిల సవాల్ విసిరారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ లు కలిసి ఏపీకి అన్యాయం చేశారన్న షర్మిల.. వారి మధ్య రాజకీయంగా ఫెవికాల్ బంధం ఉందనే విషయం అర్థమయిందని స్పష్టం చేశారు.
కాగా.. అనంతపురంలో నిర్వహించిన న్యాయ సాధన కార్యక్రమరం వేదికగా సీఎం జగన్ పై షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి కనీసం ఒక్క రాజధాని అయినా లేకుండా చేశారు. వ్యవసాయం అధ్వాన్న స్థితిలో, రైతులు దీనావస్థలో ఉన్నారు. ప్రజలను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైంది. ఓట్లు అడిగే హక్కుల వైసీపీకి లేదు. జగన్ పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. చెల్లి అని చూడకుండా జగన్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారు". అని వైఎస్.షర్మిల అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 28 , 2024 | 04:06 PM