YS Sharmila : వారే కొట్టుకుని.. రాహుల్‌ను అంటున్నారు
ABN, Publish Date - Dec 21 , 2024 | 05:56 AM
బీజేపీ నేతలు వారే కొట్టుకుని.. నెపం రాహుల్‌గాంధీపై నెడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
అమిత్‌షా రాజీనామా కోరుతున్నందుకే ఈ డ్రామా: షర్మిల
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు వారే కొట్టుకుని.. నెపం రాహుల్‌గాంధీపై నెడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శక్రవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో బీజేపీ దాడి డ్రామాకు తెరతీసిందన్నారు. అంబేడ్కర్, రాజ్యాంగంపై బీజేపీకి, ఆర్‌ఎ్‌సఎ్‌సకు ఎప్పుడూ చులకన భావమేనని అన్నారు. అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తొలగించాలంటూ ‘ఎక్స్’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాదిమంది దళితులు, అణగారిన వర్గాల జీవితాలను మార్చేసిన గొప్పవ్యక్తి అంబేడ్కర్‌ను బీజేపీ అవమానిస్తూనే ఉందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాషాయ మూకపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు.
Updated Date - Dec 21 , 2024 | 05:56 AM