ఆ నీచులెవరో తేల్చండి: షర్మిల
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:10 AM
తిరుమల అపవిత్రతపై తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలని లేదా సీబీఐతో విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల అపవిత్రతపై సీబీఐ విచారణ జరిపించాలి
సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్
తిరుమల అపవిత్రతపై సీబీఐ విచారణ చేయించాలి: షర్మిల
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల అపవిత్రతపై తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలని లేదా సీబీఐతో విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని, లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును కలిపారని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆమె గురువారం ఎక్స్‌లో స్పందించారు. సీఎం హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని షర్మిల అన్నారు. తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల అపవిత్రతపై చేసిన వ్యాఖ్యలకు సీఎం కట్టుబడి ఉండాలన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 04:10 AM