ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: షర్మిల పోటీపై క్లారిటీ!.. రేపే కీలక ప్రకటన?

ABN, Publish Date - Mar 20 , 2024 | 04:37 PM

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ఎక్కడి నుంచి పోటీచేయబోతున్నారనే అంశంపై కొద్దిరోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కొందరు.. విశాఖ నుంచి చేస్తారని మరికొందరూ చెబుతూ వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో షర్మిల పోటీపై అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షర్మిల సొంత జిల్లా కడప నుంచి పోటీచేస్తే కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆలోచనతో ఏఐసీసీ కడప నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ఎక్కడి నుంచి పోటీచేయబోతున్నారనే అంశంపై కొద్దిరోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కొందరు.. విశాఖ నుంచి చేస్తారని మరికొందరూ చెబుతూ వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో షర్మిల పోటీపై అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షర్మిల సొంత జిల్లా కడప నుంచి పోటీచేస్తే కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆలోచనతో ఏఐసీసీ కడప నుంచి పోటీచేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు విజయవాడ ఆంధ్ర రత్న భవన్‌లో ఆమె కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కడప నుంచి షర్మిల పోటీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అధిష్టానం నిర్ణయంతో..

వైఎస్.షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా విశాఖలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్‌.విజయమ్మ విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత అనుభవాల దృష్ట్యా షర్మిల విశాఖ కంటే సొంత జిల్లా కడప నుంచి పోటీచేయాలని పార్టీ సీనియర్లు కోరినట్లు తెలిస్తోంది. అధిష్టానం సైతం కడప నుంచి పోటీ చేయాలని కోరడంతో ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది.

రేపే సమావేశం

ఎన్నికల సమయం దగ్గరపడుతుంటంతో.. తన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులతో చెప్పేందుకు రేపు విజయవాడలో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కడపకు చెందిన పార్టీ నేతలతో షర్మిల సమావేశమవుతుండటంతో ఆమె కడప నుంచి పోటీ చేయవచ్చనే అంచనాలకు బలం చేకూరినట్లైంది. షర్మిల కనుక కడప నుంచి బరిలోకి దిగితే అక్కడి లోక్‌సభ సీటులో పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. షర్మిల రేపటి సమావేశంలో ఎలాంటి ప్రకటన చేస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 05:17 PM

Advertising
Advertising