ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results: ఈ విషయం తెలిసే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారా?

ABN, Publish Date - Jun 04 , 2024 | 05:56 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. ఆమె చాలా సైలెంట్‌గా యూఎస్ వెళ్లి పోయారని వారు పేర్కొంటున్నారు. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీలు.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదనే విషయాన్ని ఆ పార్టీ గౌరవ మాజీ అధ్యక్షురాలిగా వైయస్ విజయమ్మ స్పష్టంగా గ్రహించారని ఈ సందర్భంగా జిల్లా వాసులు స్పష్టం చేస్తున్నారు.


అలాగే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు దాదాపుగా ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలు.. ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయనే విషయాన్ని సైతం కన్నతల్లిగా వైయస్ విజయమ్మ గ్రహించిందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్.. ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి.. మళ్లీ ప్రభుత్వాధినేతగా అదే వైయస్ జగన్.. అదే అసెంబ్లీలో మూడు రాజధానులను ప్రకటించారని వారు గుర్తు చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని వారు వివరిస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి కావడం.. ఆ క్రమంలో ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ వ్యవహరించిన తీరుకు, ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ వ్యవహరించిన తీరుకు చాలా వ్యత్యాసం ఉందని.. దీనిని సైతం వైయస్ విజయమ్మ గమనించిందని పేర్కొంటున్నారు.


అయితే వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లిందని.. ఆ క్రమంలో ఈ కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే విషయం వెలుగులోకి వచ్చిందని కడప జిల్లా వాసులు ఈ సందర్బంగా వివరిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా వైయస్ విజయమ్మ గ్రహించిందని వారు స్పష్టం చేస్తున్నారు. అదీకాక వైయస్ జగన్ అధికారమనే అందలం ఎక్కిన తర్వాత.. ఆయన వ్యవహార శైలిలో తీవ్ర మార్పు వచ్చిందని.. ఆ విషయాన్ని వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలను స్పష్టంగా గమనించారని వారు పేర్కొంటున్నారు. అందులోభాగంగానే వారిద్దరు పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయారని వివరిస్తు్న్నారు. నాటి నుంచి వైయస్ విజయమ్మ.. తన కుమార్తె వైయస్ షర్మిలతో పాటు అడుగులో అడుగు వేసి నడిచారని జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు.


ఇక 2019 ఎన్నికలకు ముందు వైయస్ జగన్‌ని ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించేందుకు పులివెందుల్లోని వైయస్ ఫ్యామిలీ అంతా ఒక తాటిపైకి వచ్చి మరీ ప్రచారం చేశారని. కానీ 2024 ఎన్నికల ముందు అందుకు పరిస్థితులు భిన్నంగా మారిపోవడంతో వైయస్ విజయమ్మ చాలా సైలెంట్‌గా సైడ్ అయిపోయారని ఉమ్మడి కడప జిల్లా వాసులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు.

అంతేకాదు మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్‌ కొద్ది రోజులు ముందు కడప ఎంపీ అభ్యర్థి వైయస్ షర్మిలకు మద్దతు తెలపాలంటూ వైయస్ విజయమ్మ ఓటర్లను అభ్యర్థిస్తు ఓ వీడియోను సైతం విడుదల చేశారని జిల్లా వాసులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా.. జగన్ ఓటమి అనివార్యమనే తెలిసే.. వైయస్ షర్మిలకు మద్దతుగా వైయస్ విజయమ్మ వీడియో విడుదల చేశారని ఉమ్మడి కడప జిల్లా వాసులు స్పష్టం చేస్తున్నారు.

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 05:57 PM

Advertising
Advertising