ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: జగన్ సర్కార్‌కు షాక్.. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరికి బెయిల్

ABN, Publish Date - Jan 24 , 2024 | 12:58 PM

Andhrapradesh: ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి ఆపై అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి బెయిల్ మంజూరు అయ్యింది. కాసేపటి క్రితమే దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి, జనవరి 24: ఏపీ హైకోర్టులో (AP HighCourt) జగన్ ప్రభుత్వానికి (AP Government) గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) నిందితుడిగా ఉండి ఆపై అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి బెయిల్ మంజూరు అయ్యింది. కాసేపటి క్రితమే దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్య కేసులో గత 85 రోజుల నుంచి కడప జైలులో షేక్ దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేయాలంటూ దస్తగిరి తరపున హైకోర్టులో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు (బుధవారం) హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. దస్తగిరి తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని... ఎన్నికల దృష్ట్యా దస్తగిరిపై ఏపీ పోలీసులు పలు అక్రమ కేసులు నమోదు చేశారని కోర్టు ముందు వాదించారు.


ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం ఉండకూడదనే భావనతో దస్తగిరిని జైల్లోనే నిర్బంధించి సీఎం జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని దస్తగిరి భార్య ఆరోపించారు. జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి వలన తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో దస్తగిరి వాపోయిన విషయాన్ని కూడా న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. వివేకానంద హత్య కేసులో దస్తగిరి తరపున కూడా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో దస్తగిరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అందువలన బెయిల్ ఇవ్వాలి అంటూ హైకోర్టులో న్యాయవాది వాదించారు. దస్తగిరి తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కాసేపటి క్రితమే దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం గానీ కడప జైలు నుంచి దస్తగిరి విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 24 , 2024 | 12:58 PM

Advertising
Advertising