Bhanu Prakash Reddy: రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ.. ఓదార్పులకే జగన్..
ABN, Publish Date - Jul 04 , 2024 | 11:51 AM
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 71వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాధవ్, భానుప్రకాష్ రెడ్డి, మధుకర్ జీ తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 71వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాధవ్, భానుప్రకాష్ రెడ్డి, మధుకర్ జీ తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ..వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళుతున్నారన్నారు. పిన్నెల్లిని పరామర్శించాల్సిన అవసరం జగన్‌కు ఏమొచ్చిందని భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఓదార్పు యాత్రలకే ఆయన పరిమితమవుతాడన్నారు. క్షమాపణ చెప్పి జైలులో ఉన్న పిన్నెల్లి దగ్గరకి జగన్ వెళ్లాలన్నారు.
ఈవీఎంలు పగులకొట్టడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో నుంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకెళతామని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందన్నారు. వేంకటేశ్వర స్వామిని కూడా స్కాంలలో వదల్లేదన్నారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి గత ఐదేళ్లూ ఎవరి కోసం పని చేశారని ప్రశ్నించారు. ఏడు కొండల్లో జరిగిన అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి.. పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలియదన్నారు. ఇండియా కూటమి మొత్తం కలిపినా బీజేపీ మాత్రమే తెచ్చుకున్న ఎంపీ సీట్లకు సమానం కాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల కలయిక రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. గత సీఎంలు ఫాం హౌస్‌లో, ప్యాలెస్‌లో కూచున్నారే కానీ ఆలోచించలేదని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.
Updated Date - Jul 04 , 2024 | 11:52 AM